అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం?

మాస్‌కి మాంచి కిక్ ఇచ్చే పాపా నీకేదంటే ఇష్టం సాంగ్‌.

  • Published By: sekhar ,Published On : January 29, 2019 / 05:43 AM IST
అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం?

Updated On : January 29, 2019 / 5:43 AM IST

మాస్‌కి మాంచి కిక్ ఇచ్చే పాపా నీకేదంటే ఇష్టం సాంగ్‌.

రాయ్ లక్ష్మీ ప్రస్తుతం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ అనే సినిమా చేస్తుంది. ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాని కిషోర్ (లడ్డా) డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ మూవీలోని, పాపా నీకేదంటే ఇష్టం అనే సాంగ్‌ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. పాపా నీకేదంటే ఇష్టం, అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం, మామిడిపళ్ళా, జాంపళ్ళా, పిజ్జా, బర్గర్, నాటు లిక్కర్.. పాపా నీకేదంటే ఇష్టం అంటూ సాగే ఐటమ్ నంబర్ అదిరిపోయింది. ముఖ్యంగా మాస్‌కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంది.

ఇక లిరికల్ వీడియోలో రాయ్ ఒంపు సొంపులతో కుర్రాళ్ళకి మతి పోగొట్టేసింది. ఈ పాటకి సురేష్ బానిశెట్టి లిరిక్స్ రాయగా, మంగ్లీ, హరిగౌర కలిసి పాడారు. ప్రవీణ్, మధు రాయ్‌తో కలిసి రెచ్చిపోయి స్టెప్పులేసారనే విషయం విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. పూజిత పొన్నాడ, కార్తీక్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : హరిగౌర, నిర్మాతలు : ఎమ్.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి మరియు ఆర్‌కె రెడ్డి. 

వాచ్ సాంగ్…