వెంకీ మామ : రాశీఖన్నా..పాయల్ రాజ్ పుత్ టిక్ టాక్ వీడియో

రాశీఖన్నా.. పాయల్ రాజ్‌పుత్ ఒకరు ముద్దుముద్దు మాటలతో మాయ చేస్తే.. మరొకరు కంటి చూపులతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతారు. తాజాగా వీరిద్దరు నటిస్తున్న చిత్రం వెంకీమామ. వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో..2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం ఖమ్మం జిల్లాలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు చిత్ర సినిమా యూనిట్ బస్సులో బయలుదేరింది. అందులో రాశీ ఖన్నా..పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య, వెంకటేశ్‌లు, ఇతరులున్నారు. ఈ సందర్భంగా రాశీ..పాయల్‌లు వెంకీమామ సినిమాలోని ఓ డైలాగ్‌కు టిక్‌టాక్ వీడియో చేశారు. వెంకటేశ్ చెప్పిన డైలాగ్‌ను రాశీ – పాయల్ చెబుతూ కనిపించారు. ఈ వీడియో చివర్లో.. నాగచైతన్య నవ్వుతు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను రాశీఖన్నా ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
Read More : వెంకీమామ సడెన్ సర్‌ప్రైజ్: ముందుగానే మామా అల్లుళ్ల సందడి
ఇక సినిమా విషయానికి వస్తే…ఆర్మీ మేజర్‌గా నాగ చైతన్య నటిస్తుండగా వెంకటేష్ రైస్ మిల్స్ ఓనర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. రవితేజతో ‘పవర్’, పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ సినిమాలు తీసిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోలు ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. సినిమా పక్కాగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
#venkymama ?#VenkyMamaFromDec13th ✨ pic.twitter.com/qRxsLs74L7
— Raashi Khanna (@RaashiKhanna) December 7, 2019