Rachna Banerjee : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎక్కడ్నుంచో తెలుసా?

తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Rachna Banerjee : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎక్కడ్నుంచో తెలుసా?

Rachna Banerjee contesting as MP from TMC in Hooghly in upcoming Lok Sabha elections

Updated On : March 10, 2024 / 8:45 PM IST

Rachna Banerjee : గతంలో కన్యాదానం, మావిడాకులు, అభిషేకం, సుల్తాన్, బావగారు బాగున్నారా.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన రచన బెనర్జీ ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తుంది. బెంగాలీ భామ అయిన రచన బెనర్జీ బెంగాలీలో దాదాపు 50కి పైగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1992 నుంచి 2010 వరకు బెంగాలీతో పాటు తెలుగు, ఒడియా, తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా టీవీలో యాంకర్ గా, జడ్జిగా బెంగాలీ షోలలో కనిపిస్తుంది. ఈ అమ్మడు అచ్చు బెంగాలీ అమ్మాయి. కలకత్తాలోనే పుట్టి పెరిగింది. బెంగాల్ లోని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీలో ఇటీవల చేరింది రచన. త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికలకు మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించగా రచన బెనర్జీకి హూగ్లీ నియోజకవర్గం ప్రకటించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో రచన బెనర్జీ హూగ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనుంది.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కొత్త యాడ్ చూశారా? పైప్ తో కొడితే.. లీక్ అయ్యేదేలే..

ఇటీవలే రచన బెనర్జీ హోస్ట్ గా చేస్తున్న దీదీ నెం1 షోకి మమతా బెనర్జీని తీసుకెళ్లి సందడి చేసింది. ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు మమతా పార్టీలో ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకోవడం గమనార్హం. మరి గెలుస్తుందో ? ఓడుతుందో చూడాలి.

Rachna Banerjee contesting as MP from TMC in Hooghly upcoming Lok Sabha elections