Radhe Shyam: ఫ్యాన్స్ అసహనం.. అయినా కదలిక లేదే ఫాఫం!

ప్రాణాలు పోతాయని భయపెట్టినా ఏమాత్రం కదల్లేదు. నా చావుకు మీరే కారణం అని ఫ్యాన్స్ సూసైడ్ నోట్ రాసినా ఏమాత్రం అస్సలు రెస్పాన్స్ లేదు. ఎప్పుడో 3ఏళ్ల క్రితం మొదలుపెట్టిన రాధేశ్యామ్..

Radhe Shyam: ఫ్యాన్స్ అసహనం.. అయినా కదలిక లేదే ఫాఫం!

Prabhas Radheshyam

Updated On : November 12, 2021 / 9:00 PM IST

Radhe Shyam: ప్రాణాలు పోతాయని భయపెట్టినా ఏమాత్రం కదల్లేదు. నా చావుకు మీరే కారణం అని ఫ్యాన్స్ సూసైడ్ నోట్ రాసినా ఏమాత్రం అస్సలు రెస్పాన్స్ లేదు. ఎప్పుడో 3ఏళ్ల క్రితం మొదలుపెట్టిన రాధేశ్యామ్.. ఫస్ట్ నుంచీ అప్ డేట్స్ విషయంలో విమర్శలు ఫేస్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఓఫ్యాన్ ప్రభాస్ సినిమా మీద ఫ్రస్టేషన్ తో.. సూసైడ్ లెటర్ రాశారు. అయితే, అసలు ప్రభాస్ సినిమా మీద ఎందుకంత కోపం.. ఫ్యాన్స్ ఎందుకిలా ఫ్రస్టేట్ అవుతున్నారంటే మేకర్స్ సాగదీతే కారణంగా కనిపిస్తుంది.

Keerthy Suresh: స్పెయిన్‌లో కీర్తి చిల్‌అవుట్.. గ్లామర్ ట్రీట్!

ప్రభాస్ కి పాన్ ఇండియా వైడ్ గా ఇమేజ్ రాకముందే.. విపరీతమైన ఫాన్ బేస్ ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాక.. ఆ క్రేజ్, ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ ఫాన్స్ ని డైహార్డ్ ఫాన్స్ అంటుంటారు. డై హార్డ్ ఫాన్ అని ఊరికేఅంటారా.. ప్రభాస్ సినిమా కోసం ఏదైనా చేసేంత ప్రేమ, పిచ్చి ఉంటేనే అంటారు. ఈ పిచ్చి పీక్స్ కెళితే, ఆ ప్రేమ ఆఖరికి ప్రభాస్ నే టెన్షన్ పెట్టేంతగా ఉంటే.. లేటెస్ట్ గా అలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది.

RRR: మల్టీస్టారర్ మేకర్స్‌కు కొత్త పాఠంగా ఆర్ఆర్ఆర్.. దట్ ఈజ్ జక్కన్న!

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబందించి ఇప్పటి వరకూ సరైన అప్ డేట్స్ ఏం రావడం లేదు. అప్పుడెప్పుడో మూడేళ్ల నాడు మొదలుపెట్టి ఇంకా రాధేశ్యామ్ ని చెక్కుతూ ఉన్న మేకర్స్ మీద ఫ్రస్టేషన్ తో ఓ ఫ్యాన్ సూసైడ్ లెటర్ రాశారు. రాధేశ్యామ్ నుంచి అప్ డేట్స్ కోసం ఎదురుచూసీ చూసీ విసుగొచ్చేసిందని, ఈ టెన్షన్ తో, స్ట్రెస్ తో చనిపోతే.. నా చావుకి రాధేశ్యామ్ టీమ్ కారణం అంటూ రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Naina Ganguly: నైనా అందాల అరాచకం ఆపదగునా!

మూవీ క్రియేషన్స్ రాధేశ్యామ్ విషయంలో ఫస్ట్ నుంచి విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా యూరోపియన్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమా జనవరి 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. అయితే సినిమా రేంజ్ కి, ప్రభాస్ స్టామినాకి తగ్గట్టు ప్రమోషన్ల విషయంలో, అప్ డేట్స్ విషయంలో మాత్రం అన్ని సినిమాల కంటే వెనకే ఉంది మూవీ క్రియేషన్స్. ఇప్పటికే సోషల్ మీడియాలోఈ లేట్ మీద విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నమూవీ క్రియేషన్స్.. లేటెస్ట్ గా వచ్చిన ఈ సూసైడ్ నోట్ తో మరింత పెరిగింది.

Pushpa: వెనక్కు తగ్గనున్న పుష్పరాజ్?.. వాయిదా తప్పదా?

అసలు సూసైడ్ నోట్ తో అయినా ఏమన్నా అప్ డేట్ ఇస్తారేమో అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి మాత్రం మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ నెల 15న సినిమాకు సంబందించి సాంగ్ రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నా.. అసలు ఈ నోట్ మీద రెస్పాండ్ అవ్వడం కానీ, సినిమా మీద కొత్త అప్ డేట్ ఇవ్వడం కానీ చెయ్యలేదు. కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం రాదేశ్యామ్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు.