Radhika Sharath Kumar : అప్పటి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి ఈ సినిమాతో
రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కిషోర్ నాకు ఈ కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. హీరో పాత్ర ఉండగా అతని చుట్టూ ఉన్న మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజుల్లో కథ రావడం.....

Radhika
Radhika Sharath Kumar : శర్వానంద్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ డైరెక్షన్ లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా రాబోతుంది. ఈ సినిమాని మార్చ్ 4న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అప్పటి హీరోయిన్స్, సీనియర్ నటీమణులు చాలామంది నటించారు. రాధికా, ఊర్వశి, ఖుష్భు ఇలా సీనియర్ నటీనటులు చాలా మంది ఇందులో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇంటర్వ్యూలో రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ”దర్శకుడు కిషోర్ నాకు ఈ కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. హీరో పాత్ర ఉండగా అతని చుట్టూ ఉన్న మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజుల్లో కథ రావడం అరుదు. ఈ కథ నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఆల్రెడీ సినిమా కూడా చూశాను. చాలా బాగా వచ్చింది. ఊర్వశి, ఖుష్బూలతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా చిత్రీకరణ అంతా చాలా ఆహ్లాదంగా సాగింది. మా రోజుల్లో క్యారవాన్‌లు ఉండేవి కాదు. అందరం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్లం. అక్కడే కలిసి భోజనం చేసే వాళ్లం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి వాతావరణం ఈ సినిమా సెట్లో చూశా. అప్పటి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి ఈ సినిమాతో. చాలా సంతోషంగా అనిపించింది.”
Keerthi Suresh : రెండు రోజుల్లోనే ‘గాంధారి’ షూటింగ్ పూర్తి చేశాం
”ఇందులో నేను శర్వాకి తల్లి పాత్రలో నటించాను. శర్వా అద్భుతంగా నటించాడు. సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. కుటుంబంతో కలిసి హాయిగా చూసే సినిమా ఇది. ప్రతి ఫ్యామిలీ తప్పకుండా వెళ్లి సినిమా చూడండి’’ అని తెలిపారు.