Keerthi Suresh : రెండు రోజుల్లోనే ‘గాంధారి’ షూటింగ్ పూర్తి చేశాం
ఈ సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో కీర్తీ సురేష్ మాట్లాడుతూ... ‘‘గాంధారి లాంటి మ్యూజిక్ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. సాధారణంగా ఒక పాటని నాలుగు నుంచి అయిదు రోజులు షూట్........

Keerthy Suresh
Gandhari : ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. అంతే కాక మరోపక్క స్టార్ హీరోలకి చెల్లి పాత్రలు కూడా చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లో నటించింది.
ఈ ‘గాంధారి’ మ్యూజిక్ ఆల్బమ్‌ని ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇందులో ‘గాంధారి’ టైటిల్ క్యారెక్టర్ లో కీర్తి సురేష్ డ్యాన్స్ వేసింది. ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, ‘లవ్ స్టోరీ’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మ్యూజిక్ అందించగా అనన్య భట్ పాడారు. బృందా మాస్టర్ ఈ సాంగ్ కి దర్శకత్వం వహించి కొరియోగ్రఫీ చేశారు
Kajal Aggarwal : ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు
ఈ ‘గాంధారి’ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 21 సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచింగ్ కార్యక్రమం హైదరాబాద్ పార్క్ హయత్ లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో కీర్తీ సురేష్ మాట్లాడుతూ… ‘‘గాంధారి లాంటి మ్యూజిక్ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. సాధారణంగా ఒక పాటని నాలుగు నుంచి అయిదు రోజులు షూట్ చేస్తారు. కానీ గాంధారి ఆల్బమ్ కేవలం రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. గతంలో బృందా మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేసిన పాటల్లో నేను డ్యాన్స్ చేశాను. ఇప్పుడు ఆమె దర్శకత్వంలో కూడా వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ‘సారంగ దరియా’ పాట తర్వాత ఈ ‘గాంధారి’ సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్ మరో హిట్ అందుకుంటారు” అని తెలిపింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కూడా ఉంది.