Rag Mayur : నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్..
ఈ క్రమంలో రాగ్ మయూర్ కి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. (Rag Mayur)
Rag Mayur
Rag Mayur : విభిన్న కథలతో, పాత్రలతో పలకరిస్తున్న తెలుగు నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. 2021 లో సినిమా బండి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాగ్ మయూర్ ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, మిత్రమండలి, పరదా, గాంధీతాత, శుభం సినిమాల్లో కనిపించి హీరోగా, కమెడియన్ గా, విలన్ గా మెప్పించాడు.
సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ కు రీమేక్‌గా వచ్చిన తెలుగు సిరీస్ ‘సివరాపల్లి’లో హీరోగా అందర్నీ మెప్పించాడు. త్వరలో హీరోగా అనుమాన పక్షి అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రమంలో రాగ్ మయూర్ కి ఉత్తమ నటుడు అవార్డు వరించింది.
Also Read : Salman Khan : ఈ పోస్ట్ తో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్టేనా..? సల్మాన్ ఖాన్ పోస్ట్ వైరల్..
ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటుడిగా ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌లో ఆయన పోషించిన పాత్రకు అవార్డును సొంతం చేసుకున్నారు రాగ్ మయూర్. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఓటీటీలో వచ్చిన సినిమాలకు, సిరీస్ లకు ఈ అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన అవార్డులలో తెలుగు నటుడు రాగ్ మయూర్ అవార్డు అందుకోవడం విశేషం.
తన నటనతో మెప్పిస్తూ హీరోగా, కమెడియన్ గా, విలన్ గా.. వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు రాగ్ మయూర్.
