Chandramukhi 2 Trailer : 17 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ అవుతుందా..?
లాఘవ లారెన్స్(Raghava Lawrence) నటిస్తున్న సినిమా చంద్రముఖి 2 (Chandramukhi 2). ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్.

Chandramukhi 2 Trailer
Chandramukhi 2 Trailer : లాఘవ లారెన్స్(Raghava Lawrence) నటిస్తున్న సినిమా చంద్రముఖి 2 (Chandramukhi 2). ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Deverakonda : యాదాద్రి ఆలయం గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వం..
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ మొత్తం వడివేలు భయపడుతూ తనదైన శైలిలో కామెడీ పంచాడు. ఇది అదే.. చంద్రముఖి మళ్లీ వచ్చేసింది, 17 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ అవుతుందా..? అంటూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. వెట్టయరాజాకు చంద్రముఖికి మధ్యలో పగ ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి ‘హంగ్రీ చీతా’ సాంగ్ రిలీజ్..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 2005లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్‌గా తాజాగా చంద్రముఖి 2 తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.