Raghavendra Rao: తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.. CM జగన్ నిర్ణయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు.

Raghavendra Rao: తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.. CM జగన్ నిర్ణయంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు!

Raghavendra Rao Comments on Health University Name Change

Updated On : September 24, 2022 / 5:16 PM IST

Raghavendra Rao: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల దగ్గర నుంచి సాధారణ ఓటర్ల వరకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Balakrishna : ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలయ్య మాస్ వార్నింగ్

ఈ క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా స్పందించారు. నందమూరి తారక రామారావు గారితో ‘వేటగాడు’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన రాఘవేంద్రరావుకి అన్న NTR అంటే ఎంతో అభిమానం ఉంది. దీంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పును తప్పుపడుతూ ట్వీట్ చేశారు.

“తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది” అంటూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ దర్శకేంద్రుడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.