హాలీవుడ్ హీరోగా..
హాలీవుడ్ మూవీలో హీరోగా యాక్ట్ చెయ్యబోతున్న రాహుల్ రామకృష్ణ.

హాలీవుడ్ మూవీలో హీరోగా యాక్ట్ చెయ్యబోతున్న రాహుల్ రామకృష్ణ.
అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. తర్వాత భరత్ అనే నేను, సమ్మోహనం, గీతగోవిందం, హుషారు వంటి పలు హిట్ సినిమాలు చేసాడు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీలో హీరోగా యాక్ట్ చెయ్యబోతున్నాడు రాహుల్ రామకృష్ణ. ప్రదీప్ కటసాని నిర్మిస్తూ, దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీకి సిల్క్ రోడ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సిల్క్ రోడ్ పోస్టర్‌ని షేర్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు రాహుల్. నేను ఇన్నాళ్ళూ ఎదురుచూసిన నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది..
ఈ న్యూస్, నేను ఊహించిన దానికంటే చాలా స్పీడ్‌గా బయటకొచ్చింది. సిల్క్ రోడ్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నా, చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అని పోస్ట్ చేసాడు. అమెరికాలో ఉండే తెలుగు స్టూడెంట్ లైఫ్ స్టైల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది. అలాగే, లాస్ ఏంజెల్స్‌లో సైబర్ క్రైమ్, డ్రగ్స్ నేపథ్యాన్ని కూడా చూపిస్తారని అంటున్నారు. దాదాపు 2 గంటల నిడివితో రూపొందించబోయే ఈ సినిమాలో, రాహుల్ సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.
ఫోటోగ్రఫీ : జాన్ ఓర్పన్, ఎడిటర్ : మార్క్.
వాచ్ పోస్టర్…