Rahul Sipligunj : నా జీవితంలో జరిగిన చిల్లర ఫైట్ అదే.. బెల్ట్ దెబ్బలు తిన్న రాహుల్ సిప్లిగంజ్..

Rahul Sipliganj about fight with his dad
Rahul Sipligunj : టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ గురించి తెలిసిందే. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఇప్పటికే చాల ప్రైవేట్ సాంగ్స్ చేసాడు. RRR సినిమాలో నాటు నాటు సాంగ్ పాడే అవకాశాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకుల దగ్గర నుండి ఆదరణ పొందుతున్నాడు. ఓ వైపు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు పలు యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్నారు.
అలా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్.. తను చూసిన ఓ చిల్ల ఫైట్ గురించి చెప్పారు. తను పుట్టి పెరిగిన ఊరిలో ఎవరో తెలియని వ్యక్తి ఒక షాప్ లో ఐదు రూపాయలు అప్పు పెట్టారట. బిర్యాని కోసం ఆయన ఆ అప్పు చేశారట. ఆ ఐదు రూపాయల కోసం కౌన్సిలర్ మర్డర్ చేశారట. ఎలా జరిగిందో తెలీదు కానీ.. రెండు వైపుల గ్యాంగ్ పెరిగిపోయి ఇలా జరిగిందని రాహుల్ అన్నారు. మొత్తానికి ఇలా తను చూసిన చిల్లర ఫైట్ గురించి చెప్పాడు.
Also Read : Anchor Lasya : భర్తతో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న యాంకర్ లాస్య.. ఫొటోలు వైరల్..
అలాగే మీ నాన్న చేతిలో ఎప్పుడైనా బెల్ట్ దెబ్బలు తిన్నారా అని యాంకర్ అడిగితే.. చాలా సార్లు మా నాన్న నన్ను బెల్ట్ తో కొట్టాడు. కాలేజ్ లో ఉన్నప్పుడు రోజూ ఏదో ఒక గొడవ చేసేవాడిని, అది మా నాన్నకి నచ్చక బెల్ట్ తో కొట్టేవాడు. అంతేకాదు బెల్ట్ విరిగిపోయేలా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు.