Varanasi : గ్లోబల్ రేంజ్ ప్రమోషన్స్.. మొదలెడదామా.?
వారణాసి (Varanasi) సినిమా ప్రమోషన్స్ కూడా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడట దర్శక ధీరుడు రాజమౌళి.
Rajamouli Mahesh Babu Varanasi Pramotions plan
Varanasi : మూవీ ప్రమోషన్స్‌లో రాజమౌళి తర్వాతే ఎవరైనా. సినిమా ముహూర్తం డే నుంచి.. రిలీజ్ వరకు ఏ చిన్న అంశాన్ని వదలకుండా హైప్ క్రియేట్ చేయడంలో జక్కన్న ప్లానింగే వేరు. ఇప్పుడు వారణాసి సినిమా ప్రమోషన్స్ కూడా అప్పుడే అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడట దర్శక ధీరుడు.
ఇక టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసి దునియా దృష్టిని ఆకర్శించిన రాజమౌళి.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న వారణాసి సినిమా కోసం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, వరల్డ్ వైడ్‌గా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Anasuya Bharadwaj : చీరకట్టులో తెలుగు అందం.. యాంకర్ అనసూయ క్యూట్ ఫోటోలు.. వైరల్
సినిమా విడుదలకు ముందే గ్లోబల్ ఆడియన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా రాజమౌళి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథ, విజువల్స్, హైస్టాండర్డ్ మేకింగ్‌తో ఇప్పటికే అంచనాలు పెంచేసిన జక్కన్న..వారణాసి ప్రమోషన్లు కూడా నెవర్ బిఫోర్ అన్నట్లుగా చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట.
ఏ స్టేట్‌లో ఎలాంటి ప్రమోషన్స్ చేయాలి.. ఎవరికి గెస్టులుగా ఇన్వైట్ చేయాలి..ఏ డయాస్ మీద సినిమా నుంచి ఎలాంటి కంటెంట్‌ను రిలీజ్ చేయాలనే దానిపై ఎక్సర్సైజ్ నడుస్తోందట. నార్త్ టు సౌత్.. ఇండియా వైడ్‌గా క్యాంపెయిన్‌తో పాటు..విదేశాల్లోనూ ప్రమోషన్స్‌కు పకడ్బందీగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
