SS Rajamouli: పొలిటిక‌ల్‌గా రాజ‌మౌళి అభిమానించే లీడ‌ర్ ఎవ‌రో తెలుసా..?

మంత్రి హ‌రీశ్‌రావు(Minister Harish Rao)కు తాను పెద్ద అభిమాని అని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి(Director SS Rajamouli) అన్నారు. మంత్రి ప‌ని తీరు త‌న‌కు చాలా బాగా న‌చ్చుతుంద‌ని, ఆయ‌న్ను క‌లుసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పారు.

SS Rajamouli: పొలిటిక‌ల్‌గా రాజ‌మౌళి అభిమానించే లీడ‌ర్ ఎవ‌రో తెలుసా..?

SS Rajamouli

Updated On : June 12, 2023 / 8:51 PM IST

SS Rajamouli-Harish Rao: మంత్రి హ‌రీశ్‌రావు(Minister Harish Rao)కు తాను పెద్ద అభిమాని అని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి(Director SS Rajamouli) అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్స‌వంలో మంత్రి హ‌రీశ్‌రావుతో క‌లిసి రాజ‌మౌళి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. మంత్రి హ‌రీశ్‌రావు ప‌ని తీరు చూసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు తాను పెద్ద అభిమాని అంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్ కోసం కొన్నాళ్ల క్రితం సిద్ద‌పేట‌కు వెళ్లాను. ఇటీవ‌ల మ‌ళ్లీ వెళ్లా. అప్పుడు తాను చూసిన సిద్దిపేట‌కు ఇప్ప‌టికి ఎంతో మార్పు వ‌చ్చింద‌న్నారు. మంత్రి ప‌ని తీరు త‌న‌కు చాలా బాగా న‌చ్చుతుంద‌ని, ఆయ‌న్ను క‌లుసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పారు.

అనంత‌రం మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ ఆస్కార్‌ సాధించినందుకు రాజ‌మౌళిని అభినందించారు. తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన గొప్ప ద‌ర్శ‌కుడు అని అన్నారు. ‘బాహుబ‌లి’ తో తెలుగు ఖ్యాతిని జాతీయ‌స్థాయిలో ఇనుమ‌డింప‌జేశార‌ని, ‘ఆర్ఆర్ఆర్’ తో విశ్వ‌వ్యాప్తం అయ్యేలా చేశార‌న్నారు. రాజ‌మౌళి సినిమాల్లో దేశ భ‌క్తి, సామాజిక స్పృహ క‌నిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని హ‌రీశ్ రావు ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళిని మంత్రి హ‌రీశ్ రావు స‌న్మానించారు.

Manoj Manchu : ఆదిపురుష్ సినిమాని వారికి ఫ్రీగా చూపిస్తానంటున్న‌ మంచు మ‌నోజ్.. ఎవ‌రికో తెలుసా..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు క‌లిసి న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ప్ర‌తీచోటా ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దాదాపు వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

Adipurush : హ‌నుమంతుడి ప‌క్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్‌.. ఎంతో తెలుసా..?

ఇక సినిమా త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా పాన్ వ‌ర‌ల్డ్ సినిమాని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు రాజ‌మౌళి. ఈ అడ్వెంచ‌ర్ మూవీకి విజేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్‌ అభిమానులు ఇది వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని రీతిలో, స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం ఈ సంవ‌త్స‌రం ఆఖ‌రిలోగానీ వ‌చ్చే ఏడాది మార్చిలో ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎవ‌రెవ‌రు నటిస్తున్నారు, ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుంద‌నే విష‌యాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.