Rajamouli : మహేష్, ప్రియాంకతో సహా.. వాళ్ళందరి దగ్గర.. ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకున్న రాజమౌళి?

SSMB 29 సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకుంటున్నాడు రాజమౌళి..

Rajamouli Takes Signs from Mahesh Priyanka and Whole Main Cast and Crew of SSMB 29 on Non Disclosure Agreements Rumors goes Viral

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ SSMB29 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ లేవు.

కానీ అధికారికంగానో, అనధికారికంగానో ఈ సినిమా నుంచి ఏదో ఒక లీక్స్ అయితే వస్తున్నాయి. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి ఈ సినిమాని ఇండియానా జాన్స్ తరహాలో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించబోతున్నాడు. ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకుంటున్నాడు రాజమౌళి..

Also See : పంజా డైరెక్టర్ కొత్త సినిమా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్ చూశారా? బ్రేకప్ చెప్పిన ప్రియురాలిని కాపాడటానికి..

ఇప్పటికే సినిమా షూటింగ్ జరిగే ప్రదేశానికి అందులో పనిచేసే ఎవ్వరూ షూట్ కి ఫోన్ తీసుకురాకూడదు అని రూల్ పెట్టారట. సినిమాలో నటించే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా షూటింగ్ లొకేషన్స్ లో ఫోన్ వాడకూడదు అని కఠిన నిర్ణయాన్ని అమలు చేసారు. ఆ ప్లేస్ లోకి సినిమాలో పనిచేసే వారికి ఇచ్చిన ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారట. తాజాగా మరో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమాకు పనిచేసే ఆర్టిస్టులు, మెయిన్ టెక్నిషియన్స్ అందరి దగ్గర ఓ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించుకున్నారట.

రాజమౌళి మహేష్, ప్రియాంకతో సహా సినిమాకు పనిచేసే మెయిన్ వాళ్ళందరి దగ్గర Non-Disclosure Agreement (NDA) మీద సంతకాలు చేయించుకున్నారని సమాచారం. ఈ అగ్రిమెంట్ ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఎటువంటి సమాచారం బయట లీక్ అవ్వకూడదు అని, వీళ్ళు ఎవ్వరికి సినిమా సమాచారం గురించి చెప్పకూడదు అని. ఒకవేళ ఎవరైనా అధికారిక సినిమా సమాచారం లీక్ చేస్తే వారిపై లీగల్ చర్యలు తీసుకోడానికి ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయించారట.

Also Read : Shah Rukh Khan : 5 ఏళ్ళు ఫ్లాప్స్.. 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ‘కింగ్’ షారుఖ్ నెక్స్ట్ ఏంటి?

ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలే సినిమా అప్డేట్స్ అధికారికంగా ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు లీకులు రాకుండా రాజమౌళి స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటుంతుండటంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి మాత్రం పద్దతిగా ఓ ప్లాన్ ప్రకారం సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుంది. అనంతరం కెన్యా అడవుల్లో షూట్ చేస్తారని సమాచారం.