Shah Rukh Khan : 5 ఏళ్ళు ఫ్లాప్స్.. 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ‘కింగ్’ షారుఖ్ నెక్స్ట్ ఏంటి?

తాజాగా షారూఖ్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

Shah Rukh Khan : 5 ఏళ్ళు ఫ్లాప్స్.. 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ‘కింగ్’ షారుఖ్ నెక్స్ట్ ఏంటి?

Shah Rukh Khan gives his Next Movie Update under Siddarth Anand Direction

Updated On : January 28, 2025 / 3:03 PM IST

Shah Rukh Khan : 2018 నుంచి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ చూసారు. అయిదేళ్లపాటు ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయింది. షారుఖ్ పని అయిపొయింది అనుకున్నారు. కింగ్ పడిపోయాడు అన్నారు. దానికి తోడు తన కొడుకు డ్రగ్స్ కేసుతో షారుఖ్ మరింత నలిగిపోయాడు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2023లో మూడు సినిమాలతో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. పఠాన్, జవాన్, డుంకి సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టాడు.

తాజాగా షారూఖ్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 2023లో బ్యాక్ టూ బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి లాస్ట్ ఇయర్ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి సాలిడ్ సినిమా ‘కింగ్’తో వస్తానంటున్నారు షారూఖ్ ఖాన్. షారూఖ్ 5 ఏళ్ల ఫ్లాపులకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సిద్థార్ద్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. పఠాన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సిద్దార్ద్, షారూఖ్ కాంబినేషన్లో తెరకక్కుతున్న సినిమాకు మామూలుగానే అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వీటిని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి షారూఖ్ కామెంట్స్ .

Also See : Experium Park Inauguration: చిరంజీవి పై సీఎం రేవంత్‌కు ఎంత అభిమానమో.. మీరు కూడా చూడండి..

షారూఖ్ ఖాన్ తాజాగా ఓ ఈవెంట్లో.. సిద్థార్ద్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా పఠాన్ కి మించి ఉంటుందని, ఈ సినిమా గ్యారంటీగా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు. అలాగే.. సిద్దార్ద్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి సినిమా గురించి ఇంతకు మించి నేనేం చెప్పలేనంటూ డైరెక్టర్ మీద పంచ్ లేశారు షారూఖ్.

Thala Trailer : అమ్మ రాజశేఖర్ కంబ్యాక్ ఇస్తున్నాడా? కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ సినిమా.. ట్రైలర్ రిలీజ్..

షారూఖ్ ఖాన్, సిద్దార్ద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే గ్యారంటీగా నెక్ట్స్ లెవల్ యాక్షన్ ఆశిస్తారు అభిమానులు. సరిగ్గా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్ తో పాటు ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరో రెండు నెలలు డేట్స్ షారుఖ్ ఈ సినిమాకే కేటాయించాడు. ఈ కింగ్ సినిమాలో షారూఖ్ కూతురు సుహానా కూడా యాక్ట్ చేస్తుందని రూమర్ వినిపిస్తోంది. మరి ఇది సుహానా, షారూఖ్ కాంబినేషన్లో రాబోతోందా, షారూఖ్ సోలో ఫిల్మా అనేది మాత్రం కన్ఫామ్ చెయ్యాల్సి ఉంది మూవీ టీమ్.