Thala Trailer : అమ్మ రాజశేఖర్ కంబ్యాక్ ఇస్తున్నాడా? కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ సినిమా.. ట్రైలర్ రిలీజ్..

అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా తల అనే యాక్షన్ సినిమాని తీసాడు.

Thala Trailer : అమ్మ రాజశేఖర్ కంబ్యాక్ ఇస్తున్నాడా? కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ సినిమా.. ట్రైలర్ రిలీజ్..

Director AmmA Rajashekar Son Raagin Raj Introducing as Hero with Thala Movie Trailer Released

Updated On : January 28, 2025 / 9:03 PM IST

Thala Trailer : డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన అమ్మ రాజశేఖర్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. అనంతరం దర్శకుడిగా మారి రణం లాంటి సూపర్ హిట్ సినిమా తీశారు. దర్శకుడిగా ఇంకొన్ని సినిమాలు చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు. తర్వాత బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా తన కొడుకుని హీరోగా పెట్టి ‘తల’ అనే సినిమా తీసాడు.

Also Read : Balakrishna : ద‌టీజ్ బాల‌య్య‌.. ఫ్యాన్ నంబ‌ర్ ఫోన్‌లో సేవ్ చేసుకుని.. స‌ర్‌ప్రైజ్

అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా తల అనే యాక్షన్ సినిమాని తీసాడు. ఇందులో అంకిత నాస్కర్ అనే బెంగాలీ అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు తల సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

Also Read : Anjali : సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..

ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరో తన తల్లి కోసం చేసే పోరాటం అని తెలుస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు భారీగా ఉండబోతున్నట్టు, తల్లి ఎమోషన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడా? అతని తనయుడు హీరోగా నిలబడతాడా చూడాలి.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా మూవీ యూనిట్ తో పాటు సోహైల్, హీరో అశ్విన్ బాబులు గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో ఎస్తర్ నోరాన్హా మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ మీరే చేయాలని చెప్పి మరీ నాతో నటింపజేశారు. ఈ సినిమా మా మమ్మీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆమెతో కలిసి చూడాలని ఉంది అని తెలిపింది. హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ… మూవీలో అందరూ చాలా కష్టపడ్డారు. క్లైమేట్ ఛేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను నమ్మి సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమాతో వైలెంట్ వాలెంటైన్స్ అవుతుంది అని అన్నారు.

amma rajshekar thala movie

నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణంలో వేషం ఉందని చెప్పి ఇవ్వలేదు. తర్వాత చాలా సార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు అని చెప్పారు. నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ చూసి ఆశ్చర్యపోయా. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్ బాస్ లో మాకు సపోర్ట్ గా ఉన్నారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ ఆయనకు కంబ్యాక్ అవుతుంది. తల ట్రైలర్ చూసాక అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి అని అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది అని అన్నారు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరూ అమ్మ రాజశేఖర్ ఫినిష్ అన్నారు. ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా అమ్మకు ఒంట్లో బాగవులేదు అందుకే కాస్త గ్యాప్ వచ్చింది. నా కొడుకుతో సినిమా చేయాలనేది నా కోరిక. కానీ వాడితో లవ్ స్టోరీ తీయాలనిపించలేదు. అందుకే ఓ కొత్త కథ ఆలోచించి తల రాసుకున్నా. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. నా కుటుంబం మొత్తం ఆయనకు రుణపడి ఉంటాయి. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కారణం అని తెలిపారు.