RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

రాజమౌళి తన RRR సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ లో అనేక గుర్తింపులు వచ్చాయి. పలు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్..................

RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

Rajamouli wins the prestigious New York Film Critics Circle Award for the Best Director

Updated On : December 3, 2022 / 12:32 PM IST

Rajamouli :  RRR సినిమాతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు రాజమౌళి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఈ సినిమా విషయంలో రాజమౌళిని, అతని దర్శకత్వ ప్రతిభని అభినందిస్తున్నారు. ఇక రాజమౌళి గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి హాజరయ్యారు. RRR సినిమాని ప్రత్యేక ప్రదర్శనలు వేయించారు. అక్కడి ప్రేక్షకులు, మీడియాతో ముచ్చటించారు.

ఆస్కార్ లక్ష్యంగా పెట్టుకొని రాజమౌళి తన RRR సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ లో అనేక గుర్తింపులు వచ్చాయి. పలు అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో ఫుల్ పేపర్ లో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. తాజాగా RRR సినిమాకి గాను హాలీవుడ్ లో రాజమౌళి మరో అవార్డు అందుకోబోతున్నారు.

Unstoppable : సమంత గురించి ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారో తెలుసా??

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) ఇటీవల అవార్డులు ప్రకటించగా RRR సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు రాజమౌళిని అభినందిస్తున్నారు.