Rajashekar : రాజశేఖర్ హీరోగా చేయకుండా నితిన్ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు?

ఇటీవల రాజశేఖర్ నితిన్(Nithiin) సినిమాలో ఓ పాత్రకి ఓకే చెప్పారు. చిత్రయూనిట్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లు ఎన్ని రోల్స్ వచ్చినా నో చెప్పిన రాజశేఖర్ నితిన్ సినిమాకు ఎలా ఓకే చెప్పారని అనుకున్నారు అంతా.

Rajashekar : రాజశేఖర్ హీరోగా చేయకుండా నితిన్ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు?

Rajashekar Accepts Villain Role in Nithin Movies Behind Reasons

Rajashekar : యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగారు రాజశేఖర్. ఆ తర్వాత కొన్ని సినిమాలు పరాజయం పాలవడంతో కొన్నేళ్ల నుంచి అడపాదడపా హీరోగానే సినిమాలు చేస్తున్నారు. ఆయనతో పాటు ఒకప్పుడు హీరోలుగా చేసిన చాలా మంది ఇప్పుడు విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. రాజశేఖర్ కి కూడా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఆఫర్లు వచ్చినా చేయలేదు.

కానీ ఇటీవల రాజశేఖర్ నితిన్(Nithiin) సినిమాలో ఓ పాత్రకి ఓకే చెప్పారు. చిత్రయూనిట్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లు ఎన్ని రోల్స్ వచ్చినా నో చెప్పిన రాజశేఖర్ నితిన్ సినిమాకు ఎలా ఓకే చెప్పారని అనుకున్నారు అంతా. తాజాగా కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజశేఖర్ కూతురు శివాని దీని గురించి మాట్లాడింది.

శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. నాన్నకి ఎప్పట్నుంచో విలన్ పాత్రలు చేయాలని ఉంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి వారు విలన్ రోల్స్ కి స్పెషల్ అప్పీరెన్స్ తెచ్చారు. నాన్న దగ్గరకు చాలా విలన్ రోల్స్ వచ్చినా చేయలేదు. నాన్నకి ఆ విలన్ పాత్రలు అంతగా నచ్చలేదు. నితిన్ సినిమాలో క్యారెక్టర్ వక్కంతం వంశీ గారు చెప్పినప్పుడు నాన్నకి బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాలో విలన్ పాత్రకు నాన్న ఒప్పుకున్నారు. ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. భవిష్యత్తులో కూడా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తారు విలన్ గా అని తెలిపింది.

Also Read : Navdeep : విడాకులు తీసుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు..? మరోసారి పెళ్లిపై నవదీప్ కామెంట్స్..

దీంతో నితిన్ సినిమాలో రాజశేఖర్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. మరి భవిష్యత్తులో కూడా శ్రీకాంత్, జగపతిబాబు లాగా విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తారా లేదా మళ్ళీ హీరోగా సినిమాలు చేస్తారా చూడాలి. ఇలాంటి సమయంలో విలన్ గా పెద్ద సినిమాల్లో ఒప్పుకుంటే రాజశేఖర్ మళ్ళీ ఫుల్ బిజీ అవుతారని టాలీవుడ్ భావిస్తుంది.