Rajeev Kanakala : సుమ, రాజీవ్ కనకాల విడిపోయారా? నిజమెంత..?
ఇద్దరం విడివిడిగా ఉంటున్నమాట వాస్తవమే కానీ విడిపోయాం అనే వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు రాజీవ్..

Suma Rajeev Kanakala
Rajeev Kanakala: స్టార్ యాంకర్ సుమ – రాజీవ్ కనకాల లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. కెరీర్ పరంగా సుమ – రాజీవ్ ఇద్దరూ బిజీగానే ఉంటుంటారు. రీసెంట్‌గా ‘నారప్ప’ లో వెంకటేష్ బావ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్నారు రాజీవ్ కనకాల. అయితే వీరిద్దరు విడిపోతున్నట్లు, పిల్లలతో సుమ, వేరే ఇంట్లో ఒంటరిగా రాజీవ్ ఉంటున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. రీసెంట్‌గా ఆ వార్తల గురించి రాజీవ్ రెస్పాండ్ అయ్యారు. ఇద్దరం విడివిడిగా ఉంటున్నమాట వాస్తవమే కానీ విడిపోయాం అనే వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు..
‘‘సుమ, నేను విడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న (దేవదాస్ కనకాల) ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా దగ్గరకు తీసుకొద్దామనుకున్నాం కానీ కుదరలేదు. ఎందుకంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దాన్ని మా ఫ్లాట్‌కి షిఫ్ట్ చెయ్యడం కష్టమయ్యింది. నాన్నను చూసుకోవడానికి నేను ఆయనతో పాటు ఉండాల్సి వచ్చింది. అసలు కారణం ఇదే. సుమ, నేను వేరు వేరు ఇళ్లల్లో ఉండడంతో.. మేం విడిపోతున్నట్లు వార్తలు రాశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. అలాగే మా మధ్య ఎలాంటి మనస్ఫర్థలు, సమస్యలు లేవు’’ అని క్లారిటీ ఇచ్చారు రాజీవ్ కనకాల.