Sahkutumbanaam : ‘సఃకుటుంబానాం’ తెలుగింటి టైటిల్.. రేషన్ కార్డుతో ఫస్ట్ లుక్..
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'సఃకుటుంబానాం' సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Rajendraprasad Megha Akash Sahkutumbanaam First Look Released
Sahkutumbanaam : రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సఃకుటుంబానాం’. HNG బ్యానర్ లో మహాదేవ గౌడ్ నిర్మాణంలో ఉదయ్ శర్మ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ సినిమా సఃకుటుంబానాం తెరకెక్కుతుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. రేషన్ కారుపై ఫ్యామిలీ ఫొటోతో ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీంతో పోస్టర్ ఆసక్తికరంగా మారి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ.. సఃకుటుంబానాం అచ్చమైన తెలుగింటి టైటిల్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. రేషన్ కార్డు డిజైన్ లా ఉన్న పోస్టర్ బట్టి సినిమా కూడా మంచి కుటుంబ కథా చిత్రం అవుతుంది అని తెలిపారు.
ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం గమనార్హం. త్వరలోనే సినిమా నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం సఃకుటుంబానాం షూటింగ్ దశలో ఉంది. ఇది ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కుతోందని సమాచారం.