Rajini-Kamal : మరోసారి రజినీ, కమల్ తలపడనున్నారా??

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడితే ఎలా ఉంటుంది? ఈ ఏడాదే ఆ క్లాష్ కు మళ్ళీ పాజిబిలిటీస్ ఉన్నాయని టాక్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్..................

Rajini-Kamal : మరోసారి రజినీ, కమల్ తలపడనున్నారా??

Rajinikanth and Kamalhaasan box office war on Deepavali with Jailer and Indian 2 Movies

Updated On : February 7, 2023 / 12:00 PM IST

Rajini-Kamal :  సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడితే ఎలా ఉంటుంది? ఈ ఏడాదే ఆ క్లాష్ కు మళ్ళీ పాజిబిలిటీస్ ఉన్నాయని టాక్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.. ఇద్దరూ ఏడాదికి ఒక సినిమాలోనే నటిస్తారు. అయితే ఈ ఇద్దరి సినిమాలూ ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడో గతంలో కెరీర్ మొదట కొద్దిరోజుల తేడాతో తమ సినిమాలతో తలపడినా, అసలు రీసెంట్ టైమ్స్ లో అయితే అంతగా క్లాష్ అవలేదు.

2005 లో రజనీకాంత్ ‘చంద్రముఖి’, కమల్ ‘ముంబై ఎక్స్ ప్రెస్’ మూవీస్ మాత్రమే ఒకేరోజు పోటీ పడ్డాయి. వీటిలో ‘చంద్రముఖి’ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ముంబై ఎక్స్ ప్రెస్ డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు రజనీకాంత్, కమల్ హాసన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు వార్ కు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. రజినీ కాంత్ హీరోగా చేస్తున్న ‘జైలర్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 10న ఈ రెండు మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ‘జైలర్’, శంకర్ డైరెక్షన్ లో ‘ఇండియన్ 2’ మూవీస్ రెండూ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Vijay Devarakonda : పులికి పాలు పట్టించి.. సింహం, పాములతో ఆడుకుంటున్న రౌడీ హీరో..

రజనీకాంత్ గత సినిమా ‘అన్నాత్తే’ ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టరైంది. కమల్ హాసన్ ఇటీవలే ‘విక్రమ్’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి రికార్డు కలెక్షన్స్ రాబట్టాడు. ఒక విధంగా కమల్ కు ఇది సక్సెస్ పరంగా బిగ్ కమ్ బ్యాక్ మూవీ. ఇక ఎప్పటి నుంచో మంచి సక్సెస్ కోసం చూస్తున్న రజనీకాంత్ ‘జైలర్’ మూవీపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మల్లూ మెగాస్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, తమన్నా.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక విక్రమ్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ నెక్స్ట్ మూవీ ఇండియన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్, రకుల్.. లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. మరి చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ఈ దీపావళి వార్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఇద్దరి సినిమాలు ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాయో, ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.