Annaatthe Teaser : సూపర్ స్టార్.. మరణ మాస్..
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది..

Annaatthe Teaser
Annaatthe Teaser: సూపర్ స్టార్ రజినీకాంత్, ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘అన్నాత్తే’ లో రజినీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కీర్తి సురేష్ కీలకపాత్రలో కనిపించనుంది.
Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..
ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు పాటలకు, గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ చేశారు. రజినీ తన స్టైల్ అండ్ యాక్షన్‌తో చెలరేగిపోయారు. ఒక్కో షాట్ ఎంతో డెడికేషన్‌తో తెరకెక్కించాడు దర్శకుడు శివ. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయి.
Annaatthe : రజినీ – నయనతారల పెయిర్ అదిరిందిగా
రజినీ సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. బ్యాగ్రౌండ్‌లో బ్లాస్టింగ్ జరుగుతుండగా సూపర్ స్టార్ స్లో మోషన్‌లో నడుస్తూ మీసం తిప్పే షాట్ అయితే అరాచకం అనే చెప్పాలి. టీజర్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.