Thalaivar 170 : మొదలైన తలైవర్ 170 షూటింగ్.. సినిమా గురించి మొదటిసారి మాట్లాడిన సూపర్ స్టార్..

ర‌జినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Thalaivar 170 : మొదలైన తలైవర్ 170 షూటింగ్.. సినిమా గురించి మొదటిసారి మాట్లాడిన సూపర్ స్టార్..

Rajinikanth Thalaivar 170 Movie Team Full Details and Shoot starts from today

Updated On : October 4, 2023 / 2:04 PM IST

Thalaivar 170 Movie : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) జైలర్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమా భారీ విజయం సాధించి ఏకంగా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో సంక్రాంతికి లాల్ సలాం సినిమాతో రాబోతున్నారు రజిని. ఈ సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఫ్యాన్స్ అంతా తలైవర్ 170వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ర‌జినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించగా ఇందులో మంజూ వారియ‌ర్ (Manju Warrier), రితికా సింగ్ (Ritika Singh), దుషారా విజయన్ (Dushara Vijayan), రానా దగ్గుబాటి(Rana Daggubati), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

Also Read : Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ సినిమా లాస్ నుంచి ‘అరవింద సమేత’ వల్ల కోలుకున్నాం.. ఎన్టీఆర్ పిలిచి హిట్ ఇచ్చారు..

నేడు ఈ సినిమా షూటింగ్ మొదలైందని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూట్ కొచ్చిలో జరుగుతుండగా నేడు రజిని చెన్నై నుంచి విమానంలో వెళ్లారు. అయితే చెన్నై విమానాశ్రమంలో రజినీకాంత్ ని మీడియా సినిమా గురించి అడగ్గా.. నేను జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఒక మంచి సామాజిక సందేశంతో కూడింది. దానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా టైటిల్ ఏం పెట్టలేదు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని తెలిపారు. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.