Chaitanya Master : ఢీ చైతన్య మాస్టర్ అప్పుల వల్ల కాదా ఆత్మహత్య చేసుకుంది? రాజు మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

పలువురు డ్యాన్సర్లు మీడియాతో మాట్లాడుతూ చైతన్య మాస్టర్ తో తమకు ఉన్న బంధం గురించి తెలిపారు. ఈ నేపథ్యంలో ఢీ 10 విన్నర్ రాజు మాట్లాడుతూ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chaitanya Master : ఢీ చైతన్య మాస్టర్ అప్పుల వల్ల కాదా ఆత్మహత్య చేసుకుంది? రాజు మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

Raju Master comments on Dhee Chaitanya Master Demise

Updated On : May 2, 2023 / 12:12 PM IST

Chaitanya Master :  ప్రముఖ డ్యాన్స్(Dance) షో ఢీలో(Dhee) కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరులో ఓ ఈవెంట్ కు వెళ్లి అక్కడే తాను ఉన్న రూమ్ లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. చైతన్య(Chaitanya) మాస్టర్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో అప్పుల బాధల వల్లే, ఆ అప్పులు తీర్చేలేకే, ఒత్తిడి ఎక్కువయ్యే చనిపోతున్నాను అని తెలిపాడు.

నిన్న సోమవారం నాడు చైతన్య మాస్టర్ అంత్యక్రియలు నెల్లూరు దగ్గర ఆయన సొంతగ్రామంలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ఢీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు చాలా మంది వచ్చారు. పలువురు డ్యాన్సర్లు మీడియాతో మాట్లాడుతూ చైతన్య మాస్టర్ తో తమకు ఉన్న బంధం గురించి తెలిపారు. ఈ నేపథ్యంలో ఢీ 10 విన్నర్ రాజు మాట్లాడుతూ చైతన్య మాస్టర్ ఆత్మహత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఢీలోనే కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న రాజు మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను డ్యాన్స్ లోకి వచ్చినప్పటి నుంచే చైతన్య మాస్టర్ దగ్గరే ఉన్నాను. ఆయనే నాకు గురువు. మా నాన్న కంటే ఎక్కువ. ఆయన ఇలా చేసుకున్నారు అంటే నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి మాస్టర్ కి అన్ని బాధలు లేవు. ఒకవేళ అప్పులు ఉన్నా వల్ల నాన్నని అడిగితే వెంటనే తీర్చేస్తారు. మాస్టర్ తలుచుకుంటే ఆ అప్పులు తీర్చడానికి రెండు నిమిషాల పని. మాస్టర్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం సెటిల్ అయిన వాళ్ళే. కానీ మాస్టర్ ఆ కారణం చెప్పి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో నాకు కూడా అర్ధం కావట్లేదు అని అన్నారు.

Chaitanya : ఢీ డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో జబర్దస్త్ షో పై..

దీంతో రాజు మాస్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒకవేళ అప్పులు ఉన్నా తీర్చగలిగే స్థోమత ఉండి కూడా చైతన్య మాస్టర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. చైతన్య మాస్టర్ ఇంకేదైనా కారణంతో ఇలా చేశాడా అని భావిస్తున్నారు. ఇక చైతన్య మరణంతో డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.