Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!

రాకేష్ మాస్టర్ చాలా వీడియోల్లో శేఖర్ మాస్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అసలు వారిద్దరి మధ్య ఏమైంది..

Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!

Rakesh Master and Sekhar master issue news in telugu

Updated On : June 18, 2023 / 9:07 PM IST

Rakesh Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ మరణవార్త అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. రాకేశ్ మాస్టర్ ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఢీ షోతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకొని దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు.

Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్‌ మాస్టర్‌ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!

అయితే రాకేశ్‌ మాస్టర్‌ చాలా వీడియోల్లో శేఖర్ మాస్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏమి జరిగిందని చాలా మంది అభిమానులు తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పలు సందర్బాల్లో వీరిద్దర్నీ అడుగుతూ వచ్చారు. అలా రాకేశ్ మాస్టర్ ని ప్రశ్నించిన ప్రతిసారి అసలు విషయం చెప్పకుండా అనేక కారణాలు చెప్పేవారు. శేఖర్ వాళ్ల పాప పుట్టినరోజుకి పిలవలేదని, చిరంజీవి సాంగ్ ఆఫర్ వస్తే తనకి చెప్పలేదని.. ఇలా ఒకొక్కసారి ఒకొక రీజన్ చెప్పువారు.

Rakesh Master : నేను అస్తమించే సూర్యుడిని.. రాకేశ్‌ మాస్టర్‌ తన మరణం గురించి ముందే చెప్పారు.. వీడియో వైరల్!

ఇక దీని గురించి శేఖర్ మాస్టర్ ఒక అభిమాని సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. రాకేశ్‌ మాస్టర్‌ కోపానికి కారణం ఏంటో తనకి తెలియదని చెప్పుకొచ్చాడు. కానీ రాకేశ్‌ మాస్టర్ తన పై అలా ఫైర్ అవుతుంటే తనకి ఎంతో బాధ కలిగిస్తుందని శేఖర్ వెల్లడించాడు. అయితే ఇప్పటికి కూడా వీరిద్దరి మధ్య గొడవకు కారణమేంటనేది మాత్రం సస్పెన్స్‌ గానే ఉండిపోయింది. శేఖర్ మాస్టర్ గురించి ఇలా మాట్లాడితే.. జానీ మాస్టర్ గురించి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ వచ్చేవారు రాకేశ్‌ మాస్టర్.