Rakhi Sawant : సర్జరీ చేయించుకున్న రాఖీ సావంత్.. హాస్పిటల్ బెడ్ పై డ్యాన్సులేస్తూ..
రాఖీ సావంత్ ఇటీవల హాస్పిటల్ లో పేషంట్ గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ఎనర్జీని మిస్ అవ్వకూడదు అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే హాస్పిటల్ కి............

Rakhi Sawant Dancing on Hospital Bed after Operation
Rakhi Sawant : బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్, బిగ్ బాస్ తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బాగా పాపులర్ అయింది నటి, డ్యాన్సర్ రాఖీ సావంత్. తనకి సినిమాలు ఉన్నా లేకున్నా ఏదో రకంగా రోజూ వార్తల్లో నిలుస్తుంది రాఖీ సావంత్. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక వరుస వివాదాలలో నిలుస్తూ మీడియాలో ఉంటుంది. తన భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, ఆ వెంటనే తనకన్నా చిన్నవాడు, బిజినెస్‌మెన్ అదిల్ దురానీతో ప్రేమాయణం కొనసాగిస్తూ ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతుంది.
రాఖీ సావంత్ ఇటీవల హాస్పిటల్ లో పేషంట్ గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ఎనర్జీని మిస్ అవ్వకూడదు అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా తనకి శాస్త్ర చికిత్స జరిగినట్టు తెలుస్తుంది. గర్భాశయంలో కణతి ఏర్పడటం వల్ల తీవ్రంగా కడుపునొప్పి వస్తుందట. డాక్టర్ల వద్దకు వెళ్తే ఆపరేషన్ చేసి ఆ కణతిని తీసేయాలని చెప్పారు. దీంతో ఇటీవలే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రాఖీ దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంది.
ఈ విషయం తెలిసి రాఖీ ఫ్యాన్స్ తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హాస్పిటల్ బెడ్ మీద నుంచే డ్యాన్సులేస్తూ వీడియోలు పోస్ట్ చేయడంతో తనకి డ్యాన్స్ మీద ఉన్న ఇష్టాన్ని మరోసారి తెలియచేసింది అని, బాధలో ఉన్నా ఎంజాయ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.