NCB ఎదుట రకుల్..డ్రగ్స్ తీసుకోలేదు

  • Published By: madhu ,Published On : September 26, 2020 / 06:56 AM IST
NCB ఎదుట రకుల్..డ్రగ్స్ తీసుకోలేదు

Updated On : September 26, 2020 / 11:01 AM IST

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్..నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెల్లడించినట్లు సమాచారం.



సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిగింది. ఇంట్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ నటి రియా చక్రవర్తికి చెందినవని రకుల్ చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్‌కు సంబంధించి తనకు, రియాకు మధ్య చాటింగ్‌ జరిగినట్టు రకుల్‌ ఒప్పుకున్నట్టు టాక్. తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించినట్లు సమాచారం.


టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారని, ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన చాటింగ్‌ జరిగేదని ఓ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందులో గ్రూప్ అడ్మిన్ లుగా దీపిక పదుకొనె, జయా సాహా, కరీష్మా ప్రకాశ్‌, క్వాన్‌ టాలెంట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిర్‌బన్‌ దాస్‌ తదితరులు వెల్లడించింది.


త్వరలో ఏర్పాటు చేయబోయే పార్టీలో తనకు డ్రింక్స్‌ కంటే ముందు మాల్‌ (డ్రగ్స్‌) కావాలని దీపిక పదుకొనె.. జయా సాహాను అడిగినట్టు 2017, అక్టోబర్‌ 28న జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా బయటపడిందని ఆ కథనంలో వెల్లడించింది. విచారణలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.