RRR Trailer: రామ్-భీమ్.. స్నేహితులా? శత్రువులా?
ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ గడించే.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ చర్చే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ రచ్చే. ట్రైలర్ రిలీజ్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ట్రిపుల్ఆర్

Rrr Trailer (1)
RRR Trailer: ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ గడించే.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ చర్చే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ రచ్చే. ట్రైలర్ రిలీజ్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ట్రిపుల్ఆర్.. అదే ట్రైలర్ తో మరింత క్రియేట్ చేసింది. అప్పటి వరకూ కలిసున్న ఎన్టీఆర్, చరణ్ అంతలోనే ఎందుకు కొట్టుకున్నారు? అసలు ఈ ఇద్దరూ స్నేహితులా? శత్రువులా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అని సస్పెన్స్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ ఎందుకు కొట్టుకున్నారో అని ట్రిపుల్ఆర్ లో అంతకన్నా ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు.
RRR Trailer: జస్ట్ మిస్.. చెక్కు చెదరని బాహుబలి-2 రికార్డ్!
రాజమౌళి లెక్కే వేరు. ఏం చేసినా అంతే. ఆడియన్స్ ని సస్పెన్స్ లో పడెయ్యడం, సినిమా మీద హైప్స్ ఇంకాస్త పెంచెయ్యడం ఆయనకే సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ఆర్ ట్రైలర్ లో ట్విస్టులకు సర్ ప్రైజ్ అవుతున్నారు జనాలు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లు చేస్తున్నారని రివీల్ చేసిన దగ్గరనుంచి రకరకాలుగా సినిమాని ఇమాజిన్ చేసుకున్న ఆడియన్స్ తీరా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అసలు ఈ ట్విస్ట్ లు ఏంటా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
Prabhas: ప్రభాస్ అంటే ఓ వైబ్రేషన్.. అందుకే ఏషియా టాప్ ప్లేస్ దాసోహం!
చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటీ పోటీగా నటించిన ట్రిపుల్ ట్రైలర్ లో చాలా ఇంట్రస్టింగ్ విషయాలు చూపించారు రాజమౌళి. గోండు పాపని కాపాడడానికి ఎన్టీఆర్ ప్రయత్నించడం, దానికోసం బ్రిటిష్ వాళ్లని ఎదిరించడం, అంతకముందే ఫ్రెండ్స్ గాఉన్న చరణ్, ఎన్టీఆర్ ఈవిషయంలో గొడవపడడం, ఇంటెన్సివ్ ఫైట్లు.. ఇలా అసలు స్టోరీ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచిస్తున్నారు జనాలు. పర్ ఫెక్షన్ కోసం సెట్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతీ చిన్న విషయంలో డీటెయిల్డ్ గా ఉండే రాజమౌళి ఈ సినిమాలో అన్నిటితో పాటు యాక్షన్ కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు.
Kapil Biopic 83: రణవీర్, దీపికాకు షాక్.. నిర్మాతలపై చీటింగ్ కేస్!
ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ట్రిపుల్ ఆర్ లో బాహుబలిని మించి యాక్షన్ ఎపిసోడ్స్ చూపించబోతున్నారు. సినిమాలో అన్ని క్యారెక్టర్లను పవర్ ఫుల్ గా ప్రొజెక్ట్ చేస్తున్న జక్కన్న.. సినిమాని ఎక్కడా తగ్గకుండా అంతే భారీగా తెరకెక్కించారు. భారీ స్టార్ కాస్ట్ కి తగ్గట్టే సినిమాని కూడా భారీగానే జనవరి 7న రిలీజ్ చేస్తున్నారు. మరి భీమ్, రామ్ స్నేహితులా శత్రువులా పూర్తిగా అర్ధం కావాలంటే సినిమా చూడాల్సిందే కదా!
Nandamuri వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!