Ram Charan- Aditya Dhar: రామ్ చరణ్ కి ధురంధర్ దర్శకుడు స్పెషల్ రిప్లై.. సినిమా చేస్తున్నారా.. మొదలైన క్రేజీ చర్చ!
ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్- రామ్ చరణ్(Ram Charan- Aditya Dhar) కాంబోలో సినిమాపై మొదలైన ఆసక్తికర చర్చ.
Ram Charan and Aditya Dhar movie on cards
- ధురంధర్ 2పై రామ్ చరణ్ ప్రశంసలు
- స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్
- రామ్ చరణ్- ఆదిత్య ధర్ కాంబోపై మొదలైన చర్చ
Ram Charan- Aditya Dhar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నాడు. ఆయన క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరుగుతోంది. అయితే, రామ్ చరణ్ కేవలం తన సినిమాల విషయం లోనే కాదు తోటి నటీనటుల సినిమాలను ప్రోత్సహించడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ‘ధురంధర్ 2’ సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ఈ సినిమా చూసిన రామ్ చరణ్, సినిమాలోని మేకింగ్ వాల్యూస్, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌ను, కథను నడిపించిన విధానాన్ని మెచ్చుకుంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో నుండి అప్రిసియేషన్ రావడంతో ‘ధురంధర్’ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
Venky-Anil- Kalyan Ram: వెంకటేష్- కళ్యాణ్ రామ్ తో అనిల్ కొత్త మూవీ.. టైటిల్ తోనే హిట్ కొట్టేశారుగా!
రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్‌కు దర్శకుడు ఆదిత్య ధర్ ఎంతో వినయంగా, హృదయపూర్వకమైన రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan- Aditya Dhar) ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఆదిత్య ధర్, చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనతో పెద్ది సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు షూటింజి పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఈ లోపు ఆదిత్య ధర్‌తో చర్చలు జరిగాయా లేదా అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ వండర్ క్రియేట్ అవ్వడం ఖాయమని అటు మెగా అభిమానులు, ఇటు సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.
