Charan – Mahesh : అక్కినేని నాగేశ్వర రావు కోసం ఒకే వేదికపై రామ్ చరణ్, మహేష్ బాబు..

Ram Charan and Mahesh Babu Special Attraction in Unveiling idol of Akkineni Nageswara Rao Event
Charan – Mahesh : తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించి, చివరి శ్వాస వరకు కూడా సినిమాల్లోనే నిలిచిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అలాగే మహేష్ బాబు, రామ్ చరణ్, మంచు విష్ణు, జగపతిబాబు, నాజర్, బ్రహ్మానందం.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కినేని నిల్చొని ఉన్న విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో ఆవిష్కరించారు.

విగ్రహావిష్కరణ అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులంతా అక్కినేనితో తమకు ఉన్న బంధం గురించి మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహేష్ బాబు తన భర్య నమ్రత శిరోద్కర్ తో పాటు వచ్చారు. రామ్ చరణ్ ఒక్కరే వచ్చారు. అయితే చరణ్, మహేష్ ఇద్దరూ ఒకేచోట కూర్చొని నవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మహేష్ – చరణ్ అభిమానులు వీరిద్దర్నీ ఇలా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.