సైరా తెర వెనుక : సాహసం చేసిన చరణ్..కష్టపడిన సురేందర్ రెడ్డి

  • Publish Date - October 2, 2019 / 01:34 AM IST

హీరోగా కంటిన్యూ అవుతూనే ప్రొడ్యూసర్‌గా మారిన రామ్ చరణ్.. సెకండ్ మూవీతోనే సైరా లాంటి భారీ సినిమా చేసే సాహసం చేశాడు. 280 కోట్ల బడ్జెట్ పెట్టడం ఒక ఎత్తైయితే.. అది కూడా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ చేయడం నిజంగా చరణ్ చేసిన సాహసమే. తండ్రి కలను నిజం చేయడాని చాలా కష్టపడ్డాడు చరణ్. ఈ సినిమాలో మెగాస్టార్‌తోపాటు బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్.. కోలీవుడ్ నుంచి స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ ఫేమస్ హీరో సుధీప్ నటించారు.. వీరితోపాటు జగపతి బాబు.. నయనతార, తమన్నా.. ఇలా మల్టీ లాంగ్వేజ్ స్టార్స్‌తో సినిమాను రూపొందించారు.

ఇంత పెద్ద ప్రాజక్ట్‌ను కూల్‌గా హ్యాండిల్ చేసి.. మెగాస్టార్ చేత బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు చరణ్. సైరా నరసింహారెడ్డి సినిమాలో గ్రాఫిక్స్ కోసం చివరి వరకు చాలా ప్లాన్డ్‌గా వెళ్లారు.. దాదాపు  26 కంపెనీలతో సైరా గ్రాఫిక్స్ సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారు…గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే దాదాపు 45 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జాతర సందర్భంగా వచ్చే ఓ పాటలో 4 వేల 500 మంది డాన్సర్లు పర్ఫాం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఒక్క పాటని దాదాపు 14 రోజులు షూట్ చేశారు. 

సైరా కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి  సైరా సారథి.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఎంతో మంది రైటర్స్‌తో కొన్ని నెలల పాటు నరసింహారెడ్డి చరిత్రపై పరిశోధన చేసి.. చిరంజీవిని తన స్క్రిప్ట్‌తో మెప్పించాడు. దాదాపు రెండున్నరేళ్లు.. సినిమాకు కెప్టెన్‌లా నడిపించాడు. చిరంజీవి, అమితాబ్ లాంటి పెద్ద స్టార్స్‌తో పాటు..అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్‌ను హ్యాండిల్ చేస్తూ.. సైరాను రూపొందించిన సురేందర్ రెడ్డి.. మెగాస్టార్ మెచ్చిన డైరెక్టర్ అయ్యాడు.

సినిమా ప్రమోషన్స్‌తో సందడి చేశారు సైరా టీమ్. ఐదు భాషల్లో ప్రచారాలతో హెరెత్తించారు… బెంగళూరు, చెన్నైలలో మెగా హీరోల ఈవెంట్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ముంబైలో బిగ్ బీతో కలిసి చిరును నిర్మాత, నటుడు ఫరాన్ అక్తర్ చేసిన ఇంటర్వూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్‌తో రిలీజ్ అయిన టీజర్‌తో సైరా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక సైరా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ 30 నిమిషాల్లో 10 లక్షల ఫ్యూస్ సాధించింది. సెకండ్ ట్రైలర్.. అండ్ సైరా టైటిల్ సాంగ్‌కు కూడా భారీగా రెస్పాన్స్ వచ్చింది. మేకింగ్ వీడియోతో పాటు సైరాలో లీడ్ క్యారక్టర్స్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ప్రోమోస్ ట్రెండింగ్ అయ్యాయి. ఇక  తమిళ్ వర్షన్‌లో తమిళ స్టార్ అరవింద స్వామి మెగాస్టార్‌కు వాయిస్ అందించారు..