Ram Charan : మరో కొత్త బ్రాండ్ కి అంబాసిడర్ గా రామ్ చరణ్.. పాన్ ఇండియా లెవల్లో..

రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు.

Ram Charan as Brand Ambassador for Reliance Campa Cool Drink

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆ గ్లింప్స్ చూసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మన సెలబ్రిటీలు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తారు.

రామ్ చరణ్ ఇప్పటికే అనేక యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ చేయడంతో పాటు ఆ కూల్ డ్రింక్ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అగ్ర సంస్థ రిలియన్స్ ఇండస్ట్రీ ఫుడ్ & బెవర్జిస్ లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ కంపెనీ నుంచి కొన్నాళ్ల క్రితం ‘కంపా’ అనే కూల్ డ్రింక్ వచ్చింది. ఆ కూల్ డ్రింక్ ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తుంది.

Also Read : Mohan Babu : పెళ్లయిన 13 రోజులకే స్వర్గం – నరకం.. ఆరు నెలలు పనిచేస్తే..

తాజాగా ఆ కూల్ డ్రింక్ కి రామ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు రిలయన్స్ సంస్థ అధికారికంగా పోస్ట్ చేసింది. ఈ మేరకు చరణ్ ఆ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకున్న ఓ పోస్టర్ కూడా షేర్ చేసింది. అలాగే చరణ్ చేసిన యాడ్ కూడా పోస్ట్ చేసారు. ఈ యాడ్ లో చరణ్ కి షూటింగ్ లో దెబ్బ తగలగా త్వరగా కోలుకోని మళ్ళీ అదే ఉత్సాహంతో వచ్చి షూటింగ్ చేసినట్టు చూపించారు.

అయితే కొన్ని కూల్ డ్రింక్స్ ఒక్కో ఏరియాని బట్టి ఆ ఏరియా హీరోలని తీసుకొని యాడ్స్ చేస్తారు. కానీ ఈ కూల్ డ్రింక్ రామ్ చరణ్ ని ఓవరాల్ పాన్ ఇండియా వైడ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్టు తెలుస్తుంది. అందులోను ఈ యాడ్ హిందీలో చేసారు. అంటే నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేసారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 26 రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

Also Read : Rajamouli – Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు? ఇంకా ఎన్ని రోజులు ఆగాలంటే..?