Mohan Babu : పెళ్లయిన 13 రోజులకే స్వర్గం – నరకం.. ఆరు నెలలు పనిచేస్తే..

తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Mohan Babu : పెళ్లయిన 13 రోజులకే స్వర్గం – నరకం.. ఆరు నెలలు పనిచేస్తే..

Mohan Babu Tells about his first Chance in Swargam Narakam Movie under Dasari Narayana Rao Direction

Updated On : April 11, 2025 / 6:46 PM IST

Mohan Babu : హీరోగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన మోహన్ బాబు ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. త్వరలో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో మోహన్ బాబు తన కెరీర్ ప్రారంభం, తను ఎలా హీరో అయ్యాడు అని తెలిపారు.

Also Read : Roja : రీ ఎంట్రీ మొదటి ఎపిసోడ్ లోనే కామెడీ స్కిట్ వేసిన రోజా.. అత్త పాత్రలో.. ప్రోమో వైరల్..

మోహన్ బాబు మాట్లాడుతూ.. శోభన్ బాబు గారి సినిమా కూతురు కోడలుకి మా గురువు గారు దాసరి నారాయణ రావు కో డైరెక్టర్. నేను అప్రంటీస్ ని. ఆ సినిమాకు ఆరు నెలలు పనిచేస్తే 50 రూపాయలు జీతం ఇచ్చారు. అప్పట్నుంచే దాసరి గారితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆయన్ని ఛాన్స్ లు అడిగేవాడిని. నాకు పెళ్లి అయి మద్రాస్ లో కాపురం పెట్టాను.

పెళ్లయిన 13 రోజులకే దాసరి గారు డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఆడిషన్స్ కి రమ్మన్నారు. విజయవాడలో ఆడిషన్స్. మా ఆవిడకు చెప్తే హీరోగా సెలక్ట్ అవుతారు వెళ్లి రండి అన్నారు. నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను. వేరే అసోసియేట్ డైరెక్టర్స్ తీసుకున్నారు ఆడిషన్. నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఫైనల్ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో నేను లేను. నన్ను పక్కన పెట్టేసారు. కానీ తర్వాత దాసరి గారి భార్య వల్ల నేను ఆడిషన్ ఇచ్చిన క్లిప్ దాసరి గారి కంట్లో పడి ఈ అబ్బాయి బాగా చేసాడు అని పిలిపించి ఛాన్స్ ఇచ్చారు. అలా నా మొదటి సినిమా స్వర్గం – నరకం ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత నటుడిగా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు అని తెలిపారు.

Also Read : Rajamouli – Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ కూడా ఫిక్స్ చేసేసారు? ఇంకా ఎన్ని రోజులు ఆగాలంటే..?