Ram Charan Buchi Babu upcoming movie update
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్ర రిలీజ్‌కు ముందే చరణ్ తన నెక్ట్స్ మూవీని షూటింగ్‌ను మొదలు పెట్టనున్నాడట.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ కెరీర్‌లో 16వ మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ క్రమంలో ‘ఆర్‌సీ 16’(వర్కింగ్ టైటిల్)తో ఈ చిత్ర షూటింగ్‌ను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు.
Nitin Chauhan : టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత..
కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో తొలి షెడ్యూల్ జరగనుందట. దాదాపు 15 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు పాటలను ఆయన కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
జానీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా & రస్టిక్ గా ఉంటుందని గతంలోనే బుచ్చిబాబు చెప్పాడు.