Ram Charan comes Unstoppable Show shooting sets
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. ఇందుకోసం రామ్‌చరణ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కి వచ్చారు.
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ సైతం సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల, నవీన్ పొలిశెట్టి, విక్టరీ వెంకటేష్ గెస్ట్‌లుగా వచ్చిన ఎపిసోడ్స్‌లు రికార్డు వ్యూస్‌తో దూసుకుపోయాయి. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వచ్చాడు.
ఈ ఎపిసోడ్ షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఇప్పటికే చరణ్ షో వేదిక వద్దకు చేరుకున్నారు. చరణ్ కారు దిగి నడుచుకుంటూ వెలుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరి బాలయ్య.. చరణ్‌ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు. చరణ్ ఏ సమాధానాలు చెప్పాడు వంటి విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Murali Mohan : మహేశ్ బాబు ‘అతడు’ కథ మురళీమోహన్‌కు నచ్చలేదా..? మరీ సినిమా ఎలా తీశారు?