ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు.. మరణించిన పవన్ ఫ్యాన్స్ కుటుంబాలకు రూ.2.5లక్షల చొప్పున చరణ్ సాయం..

Ram Charan Response about Pawan Kalyan Fans: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు ఫ్లెక్సీ కడుతుండగా జరిగిన ప్రమాదంలో సోమశేఖర్(29), అరుణాచలం(20), రాజేంద్ర(31) మరణించారు. విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమానుల మరణం పట్ల సంతాపం తెలుపుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
‘‘కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారనే వార్త నన్ను దిగ్భాృంతికి గురిచేసింది. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు. మీరంతా ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నా మనవి.. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వాళ్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ సంతాపం వ్యక్తం చేశారు చరణ్. అలాగే మరణించిన వారి కుటుంబాలకు తనవంతుగా ఒక్కో కుటుంబానికి రూ. రెండున్నర లక్షల ఆర్థిక సాయం అందిచనున్నట్లు మరో ప్రకటనలో తెలిపారు రామ్ చరణ్.
https://10tv.in/rajamouli-told-reason-behind-not-to-donate-plasma/
— Ram Charan (@AlwaysRamCharan) September 2, 2020