Bimbisara: బింబిసార డైరెక్టర్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. ఏం చేశారంటే?
బింబిసార దర్శకుడు వశిష్ఠను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బలమైన కారణం కూడా ఉందని వారు చెబుతున్నారు.

Ram Charan Fans Warn Bimbisara Director
Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, పూర్తి ఫిక్షన్ కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే, ఈ డైరెక్టర్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ఓ కథను వినిపించాడని.. దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
Balakrishna: బాలయ్య కోసం మళ్లీ ఆమెనే పట్టుకొస్తున్నారా..?
కాగా, ఇప్పుడు ఇదే డైరెక్టర్‌కు మెగా ఫ్యాన్స్ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. అలాంటి స్టార్ హీరోను ట్రోల్ చేస్తు్న్న ఓ పోస్ట్‌ను డైరెక్టర్ వశిష్ఠ లైక్ చేయడంతో ఈ వివాదం షురూ అయ్యింది. తమ అభిమాన హీరోను ట్రోల్ చేస్తున్న పోస్ట్‌ను ఎలా లైక్ కొట్టావంటూ వశిష్ఠను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.
Bimbisara: పండగపూట షాకిచ్చిన బింబిసార.. ఇక వచ్చేది అప్పుడే!
దీంతో చేసేదేమీ లేక ఈ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్‌ను లాక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ ఫ్యాన్స్ వశిష్ఠతో సినిమా చేసే ఆలోచనను మరోసారి పరిగణించాలని వారు కోరుతున్నారు. మరి ఈ విషయంపై దర్శకుడు వశిష్ఠ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Ram Charan Fans Warn Bimbisara Director