Ram Charan : కాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని కోరికను తీర్చిన రామ్‌చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కాన్సర్ తో పోరాడుతున్న ఒక చిన్నారి కోరికను తీర్చి తన ఉదారతను చాటుకున్నాడు.

Ram Charan : కాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని కోరికను తీర్చిన రామ్‌చరణ్..

Ram Charan

Updated On : February 10, 2023 / 12:59 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. కాన్సర్ తో పోరాడుతున్న ఒక చిన్నారి కోరికను తీర్చి తన ఉదారతను చాటుకున్నాడు. చరణ్ బుల్లి అభిమాని అయిన 9 ఏళ్ళ మణి కుశాల్ కాన్సర్ తో బాధ పడుతున్నాడు. గత కొంత కాలంగా హైదరాబాద్ స్పర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్నాడు. కాగా ఇటీవల ఆ చిన్నారి హీరో రామ్ చరణ్ ని కలవాలని ఉందని తన తల్లిదండ్రులతో వెల్లడించాడు.

Ram Charan : రామ్‌చరణ్‌తో సినిమా చేస్తే.. ఆ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కాల్సిందేనా?

పేరెంట్స్ ఆ విషయాన్ని ‘మేక్ ఆ విష్’ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్ కి చేరవేశారు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే స్పందించి, తన బుల్లి అభిమాని కోరికను తీర్చడానికి హాస్పిటల్ కి చేరుకున్నాడు. మణి కుశాల్ తో కొంతసేపు సమయం గడిపి, తనకి ధైర్యం చెప్పాడు. అంతేకాదు తనకి ఒక చిన్న బహుమతి కూడా తీసుకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండడంతో అభిమానులు చరణ్ చేసిన పనికి శబాష్ అంటున్నారు.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర మొదలైంది. డైరెక్టర్ శంకర్ కీలకమైన సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే ఒక సాంగ్ షెడ్యూల్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ ని దాదాపు 500 డాన్సర్స్ తో చిత్రీకరించనున్నారట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మర్చి 27 చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.