Game Changer : గేమ్ ఛేంజర్ ‘జరగండి’ సాంగ్ పోస్టుపోన్ అయ్యిందా..? దీపావళికి రావడం లేదా..?
గేమ్ ఛేంజర్ 'జరగండి' సాంగ్ దీపావళికి రావడం లేదా..? మూవీ రిలీజ్ కూడా 2025కి..

Ram Charan Game Changer Jaragandi song postpone news viral
Game Changer : ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు శంకర్. అలాంటి దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే.. ఫ్యాన్స్ లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. కానీ ఆ మూవీ మెగా అభిమానులను తీవ్ర బాధకి గురి చేస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు గడిచి పోయింది. కానీ మూవీ మాత్రం ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మూవీ ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు.
దీంతో అభిమానులు చిత్ర దర్శకనిర్మాతల పై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి’ లీక్ అవ్వడంతో చేస్తుంది లేక దానిని అఫీషియల్ గా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. దీపావళి కి సాంగ్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ అప్డేట్ తరువాత మళ్ళీ ఏ అప్డేట్ లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక రూమర్ మొదలయింది. ‘జరగండి’ సాంగ్ రిలీజ్ పోస్టుపోన్ అయ్యిందని, దీపావళికి రావడం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
Also read : Mahesh Babu : కమల్ హాసన్, దేవినేని అవినాష్‌కి మహేష్ బాబు థాంక్యూ ట్వీట్..
Arey entra idhi #Jaragandi https://t.co/pK2wrvxdwk
— musicbyrishi (@4kords) November 10, 2023
ఈ విషయం గురించి క్లారిటీ కోసం చిత్ర నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం రెస్పాండ్ లేదు. అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే.. పోస్టుపోన్ వార్తలో ఎటువంటి నిజం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, శంకర్ ఈ సినిమా షూటింగ్ ని పక్కన పెట్టి మళ్ళీ కమల్ ఇండియన్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షూటింగ్ ఇండియన్ 2కి సంబంధించింది కాదట ఇండియన్ 3కి సంబంధించింది. ఇందుకోసం మరో నలభై రోజులు శంకర్ కేటాయిస్తున్నారట.
కాగా కమల్ సినిమా తరువాతే రామ్ చరణ్ సినిమా రిలీజ్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇండియన్ 2 ని 2024 సమ్మర్‌కి, ఇండియన్ 3ని క్రిస్టమస్ కి సిద్ధం చేస్తున్నారట శంకర్. దీనిబట్టి చూస్తే.. గేమ్ ఛేంజర్ 2025లో ఆడియన్స్ ముందుకు రాబోతుందని అభిమానులు తెగ గాబరా పడుతున్నారు. దీంతో ఈ రిలీజ్ విషయం, సాంగ్ పోస్టుపోన్ విషయం గురించి ఫ్యాన్స్ దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తూ పోస్టులు వేస్తున్నారు.