Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ఈ థియేటర్స్‌లో చూసేయండి.. దేశవ్యాప్తంగా 11 థియేటర్స్ లిస్ట్..

లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

Ram Charan Game Changer Movie Teaser Playing Theaters List Here

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ వచ్చి ట్రెండ్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ని నవంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Also Read : Thandel : తండేల్ సెట్‌లో విజిల్ వేసిన అల్లు అరవింద్.. చూసుకుందాం అన్న నాగచైతన్య.. భలే వీడియో రిలీజ్ చేశారే..

లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే టీజర్ ని దేశవ్యాప్తంగా 11 థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు హైదరాబాద్ – సుదర్శన్, వైజాగ్ – సంగం శరత్, రాజమండ్రి – శివజ్యోతి, విజయవాడ – శైలజ, కర్నూల్ – V మెగా, నెల్లూరు – S2 థియేటర్, బెంగళూరు – ఊర్వశి థియేటర్, అనంతపూర్ – త్రివేణి, తిరుపతి – PGR, ఖమ్మం – SVC శ్రీ తిరుమల, లక్నో – ప్రతిభ థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9న ప్లే చేయనున్నారు.

దీంతో ఆ ఏరియా లోని మెగా అభిమానులు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. ఈ లిస్ట్ లో మీకు దగ్గర్లో ఉండే థియేటర్ ఉంటే మీరు కూడా థియేటర్ కి వెళ్లి గేమ్ ఛేంజర్ టీజర్ చూసేయండి. ఇక టీజర్ అదిరిపోతుంది అని ఇండస్ట్రీ టాక్. అలాగే గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ ని ఇలాగే భారీగా చేయనున్నట్టు దిల్ రాజు ఇటీవల తెలిపారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ కోసం చేసిన మూడేళ్ళ నిరీక్షణకు భారీగానే ప్రమోట్ చేస్తున్నారు.