Game Changer Teaser Update : గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. మూడో సాంగ్ అప్డేట్ కూడా..

గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ తో హడావిడి చేస్తుంది మూవీ యూనిట్.

Game Changer Teaser Update : గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు.. మూడో సాంగ్ అప్డేట్ కూడా..

Game Changer Teaser Update by Dil Raju Details Here

Updated On : September 30, 2024 / 7:05 AM IST

Game Changer Teaser Update : ఇన్నాళ్లు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం, అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూసారు. గత నాలుగు రోజులుగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ తో హడావిడి చేస్తుంది మూవీ యూనిట్. ఇటీవల సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా నేడు గేమ్ ఛేంజర్ రెండో పాటని విడుదల చేయనున్నారు. ఇక ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు, అనంత్ శ్రీరామ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

ఇందులో దిల్ రాజు గేమ్ ఛేంజర్ అప్డేట్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు సెకండ్ సాంగ్ రాబోతుంది. అక్టోబర్ మొదట్లో టీజర్ రిలీజ్ చేస్తున్నాం. టీజర్ ఫ్యాన్స్ కి పండగే. అక్టోబర్ చివర్లో మూడో పాట కూడా విడుదల చేయబోతున్నాం. అక్టోబర్ నుంచి అప్డేట్స్, ఈవెంట్స్ తో ఫుల్ ప్యాక్‌డ్ గా ఉంటుంది. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి చూస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అని తెలిపారు.

Also See : గేమ్ ఛేంజర్ కోసం దిల్ రాజు, అనంత్ శ్రీరామ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?

దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం గేమ్ ఛేంజర్ టీజర్ దసరాకు రావొచ్చని భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఇలా మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.