Prabhas – Ramcharan : ప్రభాస్ పెళ్లి పై రామ్‌చరణ్ హింట్..! అమ్మాయి ఎవరంటే..?
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే రక్కున గుర్తుకు వచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

Ram Charan gave hints about prabhas wedding in balakrishna unstoppable Show
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే రక్కున గుర్తుకు వచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన పెళ్లి కోసం సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అదిగో ఆ అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకునేది అంటూ ఇప్పటికే చాలా సార్లు రూమర్లు వచ్చాయి. అయితే.. ఆ వార్తలపై ప్రభాస్ నేరుగా స్పందించింది లేదు.
ప్రభాస్ స్నేహితుడు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఆస్తకికర విషయాన్ని బయటపెట్టాడు. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు అనే విషయాన్ని చరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య అడుగగా.. ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరానికి చెందిన అమ్మాయిని చేసుకోనున్నారని చరణ్ చెప్పారట. ఇంకా ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ ఏం చెప్పాడు అనేది తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.
100 Crores : ‘ఆహా’లో మరో థ్రిల్లింగ్ సినిమా.. ‘100 క్రోర్స్’.. దయ్యాలు డబ్బులు ఎత్తుకుపోవడం ఏంటి?
ఆహాలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతుంది. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్ ఈ షోలో సందడి చేశారు. చరణ్‌కు సంబంధించిన ఎపిసోడ్ తొలి భాగం జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కూతురు క్లీంకార గురించి మాట్లాడారు. క్లీంకార నాన్న అని తనను ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు ఆమె ముఖాన్ని చూపిస్తానని అన్నారు. ఇక రెండో భాగంలో ప్రభాస్ పెళ్లితో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చరణ్ పంచుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 17న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే.. చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ నిన్న (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
Daaku Maharaaj Release Trailer : బాలయ్య ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..