Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.. ఆ పండక్కి..

'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందట. ఆ పండక్కి తీసుకు వచ్చేందుకు దిల్ రాజు..

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.. ఆ పండక్కి..

Ram Charan Kiara Advani Game Changer release date update

Game Changer : శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు కారణాలు వల్ల చిత్రీకరణ లేట్ అవ్వడంతో.. రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మే నెల లోపు ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోతుందని టాక్ వినిపిస్తుంది.

కాగా టాలీవుడ్ పలు బడా సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకొని ఉన్నాయి. వీటి మధ్యలో గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుంది..? అసలు ఈ ఏడాది వస్తుందా లేదా..? అనే టెన్షన్ ఫ్యాన్స్ కి పట్టుకుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త చరణ్ ఫ్యాన్స్ కి కొంచెం ఊరట ఇస్తుంది. ఈ సినిమాని దివాళీ కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారట.

Also read : Ram Charan : పుట్టినరోజునే రామ్ చరణ్ న్యూ రికార్డు.. నాలుగు రోజుల్లో ఇంత ఫాలోయింగా..

కాగా ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ IAS ఆఫీసర్ కి పొలిటీషియన్స్ కి మధ్య అవినీతి గురించి జరిగే కథ అంట. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి తండ్రి పాత్ర, మరొకటి కొడుకు పాత్ర.