మహేష్ కోసం చెర్రీ – బన్నీ కోసం తారక్!

మహేష్ బాబు సినిమా ప్రీ-రిలీజ్‌కి రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

  • Published By: sekhar ,Published On : December 16, 2019 / 07:18 AM IST
మహేష్ కోసం చెర్రీ – బన్నీ కోసం తారక్!

Updated On : December 16, 2019 / 7:18 AM IST

మహేష్ బాబు సినిమా ప్రీ-రిలీజ్‌కి రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

10 TV వెబ్ ఎక్స్‌క్లూజివ్ : ఫ్యాన్ వార్స్ ఎలా ఉన్నా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ఒకరి సినిమా ఫంక్షన్‌కి మరో గెస్ట్‌గా అటెండ్ అయితే ఇద్దరి హీరోల అభిమానులూ మురిసిపోతుంటారు. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి రెండు హైలెట్ ఫంక్షన్స్ జరుగబోతున్నాయి టాలీవుడ్‌లో..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న సినిమా ‘‘సరిలేరు నీకెవ్వరు’’.. 2020 జనవరి 5న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘‘అల వైకుంఠపురములో’’.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కానున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ‘‘సరిలేరు నీకెవ్వరు’’, జనవరి 12న ‘‘అల వైకుంఠపురములో’’ సినిమాలు భారీగా విడుదల కానున్నాయి.

Image