Peddi collections : పెద్ది కలెక్షన్స్ ఎంతంటే.. మరో 7 కోట్లు వస్తే..
పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ (Peddi collections) రాబడుతోంది.
Ram Charan Peddi 11 days collections
Peddi collections : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 393 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ చిత్రం మరో ఏడు కోట్లు సాధిస్తే.. 400 కోట్ల క్లబ్లో చేరుతుంది. ఈ రోజు ఈ చిత్రం నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరడం పక్కా అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Anchor Sravanthi : పూల డిజైన్, బ్లాక్ శారీలో యాంకర్ స్రవంతి.. క్యూట్ స్మైల్.. ఫోటోలు వైరల్

జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రలను పోషించారు.
#Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥
Running successfully all over in its second week 💥
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/bayNZVZzB3
— PEDDI (@PeddiMovieOffl) June 15, 2026
