Peddi : నేడే ‘పెద్ది’ ఫస్ట్ ప్రెస్ మీట్.. రామ్ చరణ్ వస్తాడా?

ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. (Peddi)

Ram Charan Peddi Movie First Press meet

Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఈ సినిమాపై హైప్ పెంచుకుంటున్నారు. అయితే అనుకున్న డేట్ కి రాక పెద్ది సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇటీవల బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్లో పెద్ది సినిమా జూన్ 25 వస్తుందని ప్రకటించారు.

దీంతో ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పెద్ది సినిమా నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈ సినిమా హైప్ కి ప్రమోషన్స్ అవసర్లేకపోయినా కనీసం మినిమమ్ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సినిమా సెట్స్ నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు, పలు వర్కింగ్ స్టిల్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో బయట ఎక్కడా కూడా కనిపించలేదు. మెగా ఫ్యాన్స్ పెద్ది నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు.

Also Read : Bellamkonda Sai Sreenivas : ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్యరెడ్డి వివాహం.. పెళ్లి ఫోటోలు చూశారా..?

అందుకే రిలీజ్ డేట్ క్లారిటీ కోసం, సినిమా అప్డేట్స్ ఇవ్వడం కోసం నేడు పెద్ది ప్రెస్ మీట్ పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ ప్రెస్ మీట్ నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, ఈ సినిమాని సమర్పిస్తున్న మైత్రి అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సాన హాజరు కాబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా వస్తారని టాక్ ఉంది.

అయితే ఈ ప్రెస్ మీట్ కి రామ్ చరణ్ వస్తారా లేదా అనేది సందేహమే. ఫ్యాన్స్ అయితే చరణ్ వస్తే బాగుండు, బయట కనిపించి చాలా రోజులు అవుతుందని ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ అయితే ఈ ప్రెస్ మీట్ కి వచ్చే అవకాశమే లేదు అని తెలుస్తుంది. మరి నేడు పెద్ది ప్రెస్ మీట్ లో మేకర్స్ ఏం చెప్తారో చూడాలి.

Also Read : Mallareddy : నా బయోపిక్ చేస్తా.. సినిమాల్లోకి ఎంట్రీపై మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..