Ram Charan poses with ICC World Cup 2023 Trophy in Melbourne
Ram Charan with World Cup 2023 : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్నఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) 15వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వెళ్లారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కరికే ఈ ఇన్విటేషన్ లభించింది.
ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ను డిస్‌ప్లేకు ఉంచింది. ఈ ప్రపంచకప్ ట్రోఫీతో రామ్‌చరణ్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నాయి. అన్నా.. ప్రపంచకప్ ను పట్టుకువచ్చేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mohanlal : ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. ఆందోళనలో ఫ్యాన్స్
గతేడాది అహ్మదాబాద్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలోనే అందుకుంది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. దీంతో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఈ మూవీ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న చరణ్ తిరిగి వచ్చిన తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. RC16 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లుగా తెలుస్తోంది.
Ammaku Prematho : అమ్మను కావ్య కలుసుకుందా..? సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో..’
Ram Charan bro bring this trophy home ?
— Aditya Soni (@imAdsoni) August 18, 2024
Bhai lee kar aaja india esko galti se australia pahuch gyi ye??
— Ravi Abhay (@RaviAbhay3) August 18, 2024