Ram Charan : రాజమౌళి ఇండియన్ స్పీల్‌బర్గ్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు..

ఇంటర్వ్యూలో చరణ్ అనేక విషయాల గురించి మాట్లాడాడు. ఇండియన్ సినిమాల గురించి, RRR గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో చరణ్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద తీసిన సినిమా RRR. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత సినిమాల్లో RRR ఒకటి. ఇప్పటికే ఆయన చాలా.................

Ram Charan : రాజమౌళి ఇండియన్ స్పీల్‌బర్గ్.. రామ్ చరణ్ వ్యాఖ్యలు..

Ram Charan Praises Rajamouli in Good Morning America Show

Updated On : February 24, 2023 / 8:31 AM IST

Ram Charan :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ప్రేక్షకులు, ప్రముఖులు ఇప్పటికీ అభినందిస్తూనే ఉన్నారు. రాజమౌళి దర్శకత్వానికి హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే RRR సినిమా అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో కూడా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక ఈ సినిమాతో రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వారికి కూడా పలు అవార్డులు, గుర్తింపులు వస్తున్నాయి. మార్చ్ లో జరగనున్న ఆస్కార్ వేడుకలకు RRR యూనిట్ ఒక్కొక్కరిగా అమెరికా తరలివెళ్తున్నారు. తాజాగా రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు. క్రిటిక్ అసోసియేషన్ అవార్డు కార్యక్రమంలో కూడా చరణ్ పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికన్ ప్రఖ్యాత టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ షోలో పాల్గొన్న మొదటి తెలుగు యాక్టర్ గా చరణ్ కి అరుదైన గౌరవం లభించింది.

Akashay Kumar : కెనడా పౌరసత్వం వదులుకుంటాను.. నా గురించి ఏం తెలియకుండానే విమర్శించారు..

ఈ ఇంటర్వ్యూలో చరణ్ అనేక విషయాల గురించి మాట్లాడాడు. ఇండియన్ సినిమాల గురించి, RRR గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో చరణ్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద తీసిన సినిమా RRR. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత సినిమాల్లో RRR ఒకటి. ఇప్పటికే ఆయన చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన్ని మేము ఇండియన్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ అని పిలుచుకుంటాము. ఆయన తర్వాతి సినిమాతో గ్లోబల్ మార్కెట్ లోకి అడుగు పెడతారు అనుకుంటున్నా. RRR సినిమాకు, నాటు నాటు పాటకు ప్రపంచమంతటా గుర్తింపు వస్తుంది, అందుకు కారణం ఆయనే. మేము ఈ సినిమాతో అన్ని చోట్ల మంచి విజయం అందుకున్నాము. ఇది మా ఆరంభం మాత్రమే అని అన్నారు. దీంతో రాజమౌళిని పొగుడుతూ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే చరణ్ స్టైలిష్ గా అమెరికాలో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.