Akashay Kumar : కెనడా పౌరసత్వం వదులుకుంటాను.. నా గురించి ఏం తెలియకుండానే విమర్శించారు..

ప్రస్తుతం అక్షయ్ సెల్ఫీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ప్రముఖ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తన కెనడా పౌరసత్వంపై మాట్లాడాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ....................

Akashay Kumar : కెనడా పౌరసత్వం వదులుకుంటాను.. నా గురించి ఏం తెలియకుండానే విమర్శించారు..

Akashay Kumar said he renounce his Canadian passport

Updated On : February 24, 2023 / 7:19 AM IST

Akashay Kumar :  మన దేశంలో ఉండే పలువురు సెలబ్రిటీలకు, కొంతమంది సామాన్యులకు కూడా వేరే దేశం పౌరసత్వం కూడా ఉంది. ఇక ఇక్కడి నుంచే వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిన చాలా మంది కూడా వేరే దేశాల పౌరసత్వం తీసుకుంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా కెనడా పౌరసత్వం ఉంది. అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం ఇప్పటికే పలు సార్లు వార్తల్లో నిలిచింది. ఇండియాలోనే ఉంటూ, ఇక్కడే సంపాదించుకుంటూ కెనడా పౌరసత్వం ఇంకా ఎలా ఉంచుకుంటావు అంటూ పలువురు అక్షయ్ ని విమర్శిస్తారు కూడా. గతంలో ఈ విషయంలో అక్షయ్ పై విమర్శలు చాలా సార్లు వచ్చాయి.

ప్రస్తుతం అక్షయ్ సెల్ఫీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ప్రముఖ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తన కెనడా పౌరసత్వంపై మాట్లాడాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇక్కడ నాకు చేయడానికి ఏమి లేదు అనుకున్నాను. కెనడాలో నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. అతనే నాకు కెనడాలో జాబ్ చూపించాడు. నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడ పౌరసత్వం తీసుకున్నాను. అయితే అప్పటికి నావి రిలీజ్ కావాల్సినవి రెండు సినిమాలు ఉన్నాయి. నేను కెనడా వెళ్లిపోయాక ఆ సినిమాలు రిలీజయి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో చాలా మంది మళ్ళీ ఇక్కడకు వచ్చి సినిమాలు చేయమన్నారు. నా కెనడా ఫ్రెండ్ కూడా ఇక్కడికే వెళ్లిపొమ్మన్నాడు. దీంతో నేను మళ్ళీ ఇండియాకి వచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టాను.

Soheal Kathuriya : హీరోయిన్ పేరు టాటూ వేయించుకున్న భర్త..

ఇక్కడకు వచ్చాక నేను నా పని, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. అసలు నాకు కెనడా పౌరసత్వం ఉందనే విషయం కూడా గుర్తులేదు. ఆ పాస్ పోర్ట్ కూడా ఎక్క్డడ కొన్ని రోజులు దొరకలేదు. కానీ కొంతమంది నన్ను ఈ విషయంలో విమర్శించారు. నేను ఎందుకు వెళ్లానో, నా గురించి ఏమి తెలియకుండానే విమర్శలు చేశారు. నాకు భారతదేశమే సర్వస్వం. నేను ఇక్కడే సంపాదించుకున్నాను. ఇక్కడే తిరిగి ఇస్తాను. కొన్ని నెలల క్రితమే నేను కెనడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాను అని తెలిపాడు.