Ram Charan – Agent : నీ కమాండ్ కోసమే ఎదురు చూస్తున్నా సీనియర్.. చరణ్ ‘ఏజెంట్’ టీజర్ చూశారా?

అఖిల్ ఏజెంట్ తో చరణ్ ధృవ టీజర్ రిలీజ్. సూపర్ ఉంది మీరు చూశారా?

Ram Charan promotions for Akkineni Akhil Agent movie

Ram Charan – Agent : అక్కినేని అఖిల్ (Akkineni Akhil), స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ రేపు (ఏప్రిల్ 28) రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ ట్రైలర్స్ సినిమా పై ఆడియన్స్ లో బజ్ ని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాని మరింతగా ప్రేక్షకులకు దగ్గరు చేసేలా అదిరిపోయే ప్రమోషన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ని రంగంలోకి దించారు.

Jio Cinemas : మొన్న IPL.. ఇప్పుడు HBO.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో జియో సినిమాస్!

గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ ధృవ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ కోసం ధృవ క్యారెక్టర్ ని తీసుకు వచ్చారు. అఖిల్ కోసం చరణ్ ధృవ గెటప్ లో చేంజ్ అయ్యి ఒక స్పెషల్ వీడియో చేశాడు. ఈ వీడియోలో రామ్ చరణ్ ఒక బిల్డింగ్ లో గన్ చెక్ చేస్తూ ఫోన్ లో అఖిల్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఏజెంట్ ఎక్కడ ఉన్నావు. నీ సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ ఇక్కడ అని చరణ్ చెప్పగా, అందుకు అఖిల్.. నీ కమాండ్ కోసమే ఎదురు చూస్తున్నా సీనియర్ అంటూ బదులిచ్చాడు.

Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?

ఈ వీడియోని అఖిల్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ ని ఒకే స్క్రీన్ మీదకి కేవలం ప్రమోషన్స్ కోసమే తీసుకు వచ్చారా? లేదా ఫ్యూచర్ సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తూ ఏమన్నా సినిమా ఉండబోతుందా? అనేది తెలియాలి. కాగా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తుంది.